Share News

ముఖ్యమంత్రి ఇప్పటికైనా నిజాలు చెప్పాలి: కవిత

ABN , Publish Date - Feb 10 , 2026 | 12:36 PM

ప్రభుత్వంపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర విమర్శలు చేశారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారం, ప్రభుత్వ విధానాలపై ఆమె తన అభిప్రాయాలను చెబుతూ ఆగ్రహం వ్యక్తం చేశారు..

ముఖ్యమంత్రి ఇప్పటికైనా నిజాలు చెప్పాలి: కవిత
Kavitha On Municipal Elections

హైదరాబాద్: మున్సిపల్ బూతుల వర్షం ఆగిపోవడం సంతోషంగా ఉందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారం చూశాక.. పార్టీ గుర్తులు లేకుండా ఎన్నికలు జరిగితే బాగుండేదని కవిత అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి సొంత జిల్లాలో మంచినీరు, పారిశుధ్యం లోపిస్తోందని, ఈ అంశాలపై ఎన్నికల ప్రచారంలో చర్చ జరగలేదని ఆమె వ్యాఖ్యానించారు. మున్సిపల్ ఎన్నికల్లో మంచి వ్యక్తులను ఎన్నుకోవాలని ప్రజలకు సూచించారు.


కేవలం సిద్ధిపేట మున్సిపాలిటీకి మాత్రమే నిధులు మంజూరు అయ్యాయని.. హరీష్ రావు, ముఖ్యమంత్రికి మధ్య ఏముందో అర్థం చేసుకోవాలని కవిత అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సంపద సృష్టించకుండా.. ఆస్తులను అమ్ముతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాబోయే బడ్జెట్‌లో అన్ని వర్గాలకూ న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. 50 శాతం మంది రైతులకు ఇంకా రుణమాఫీ చేయలేదని వెల్లడించారు. రుణమాఫీపై చర్చకు తాము సిద్ధమని.. సచివాలయాలనికి రమ్మంటారా.. ముఖ్యమంత్రి సొంత జిల్లాకు రమ్మంటారా అంటూ ప్రశ్నించారు. ముఖ్యమంత్రి ఇప్పటికైనా నిజాలు చెప్పాలన్నారు.


ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్కకు జాగృతి తరపున వినతి పత్రం అందిస్తామని కవిత తెలిపారు. లేబర్ కోడ్‌కు వ్యతిరేకంగా 12వ తేదీన బంద్‌కు జాగృతి మద్దతు ఇస్తోందని వెల్లడించారు. ఈ క్రమంలోనే ఎంఐఎం పార్టీ పొద్దు తిరుగుడు పువ్వులా.. ఎవరు అధికారంలో ఉంటే వారి వెంట ఉంటుందని సెటైర్లు వేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో రాయల తెలంగాణకు ఒవైసీ బ్రదర్స్ మద్దతు ఇచ్చారని, రేవంత్ రెడ్డి ఆర్ఎస్ఎస్ మనిషి అన్న ఒవైసీ.. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సపోర్ట్ చేశారని కవిత విమర్శించారు.


ఇవి కూడా చదవండి..

మీ కళ్లు చురుకైనవి అయితే.. ఈ చెట్టుపై పక్షి ఎక్కడుందో 10 సెకెన్లలో కనిపెట్టండి!

విద్యుత్తు చార్జీల భారం తగ్గాలి

Read Latest Telangana News And Telugu News

Updated Date - Feb 10 , 2026 | 01:00 PM