Share News

జీహెచ్‌ఎంసీ, స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలి

ABN , Publish Date - Sep 29 , 2026 | 06:18 AM

హైదరాబాద్‌ (జీహెచ్‌ఎంసీ)తోపాటు స్థానిక సంస్థల ఎన్నికలే లక్ష్యంగా ముందుకు వెళ్లాలని, ఇకపై అన్ని ఎన్నికల్లో తెలంగాణ రక్షణ సేన తరఫున పోటీ చేద్దామని పార్టీ శ్రేణులతో టీఆర్‌ఎస్‌ అధ్యక్షురాలు కవిత పేర్కొన్నారు.

జీహెచ్‌ఎంసీ, స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలి
Kalvakuntla Kavitha

  • పార్టీ శ్రేణులతో టీఆర్‌ఎస్‌ అధ్యక్షురాలు కవిత

హైదరాబాద్‌, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి) : హైదరాబాద్‌ (జీహెచ్‌ఎంసీ)తోపాటు స్థానిక సంస్థల ఎన్నికలే లక్ష్యంగా ముందుకు వెళ్లాలని, ఇకపై అన్ని ఎన్నికల్లో తెలంగాణ రక్షణ సేన తరఫున పోటీ చేద్దామని పార్టీ శ్రేణులతో టీఆర్‌ఎస్‌ అధ్యక్షురాలు కవిత పేర్కొన్నారు. ఎన్నికల్లో సత్తా చాటేందుకు సిద్ధం కావాలని సూచించారు. టీఆర్‌ఎస్‌ కార్యాలయంలో సోమవారం ఉమ్మడి మహబూబ్‌నగర్‌, ఉమ్మడి మెదక్‌ జిల్లాల నేతలతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. టీఆర్‌ఎస్‌ ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించాలని, పార్టీ శ్రేణులు నిత్యం ప్రజల్లోనే ఉంటూ సమస్యల పరిష్కారం కోసం చర్యలు చేపట్టాలన్నారు.


ఆదిలాబాద్‌ రిమ్స్‌లో అగ్ని ప్రమాదం జరిగి ఐదుగురు చిన్నారులు మృతిచెందిన ఘటనలో తెలంగాణ రక్షణ సేన స్పందించిన తీరుతోనే ప్రభుత్వం దిగొచ్చిందని గుర్తు చేశారు. తక్షణ చర్యల కోసం రిమ్స్‌కు రూ.11కోట్లు విడుదల చేసిందని, మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించిందని చెప్పారు. కాగా, మెడికల్‌ సీట్లలో స్థానికతను మార్చే విధంగా ప్రభుత్వం తెచ్చిన జీవో33, జీవో 150తో తెలంగాణ విద్యార్థులకు తీరని నష్టం వాటిల్లుతుందని కవిత ఆరోపించారు. తెలంగాణకు నష్టం చేసే ఈ జీవోలను వెంటనే ఉపసంహరించుకోవాలని సోమవారం ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి:
పాలమూరు-రంగారెడ్డిని అడ్డుకోండి

రాముడికి.. శివుడికి మధ్య రాజకీయ విభజన సరికాదు

Read Latest AP News And Telangana News And International News And Telugu New

Updated Date - Sep 29 , 2026 | 06:18 AM