Share News

రాష్ట్ర అజెండా మారుస్తా: కవిత

ABN , Publish Date - Jul 01 , 2026 | 06:37 PM

తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత రాష్ట్ర రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర అజెండా మారాల్సిన అవసరం ఉందని పేర్కొంటూ, తమ పార్టీ అధికారంలోకి వస్తే ఉచిత విద్య, ఉచిత వైద్యం అందిస్తామని హామీ ఇచ్చారు.

రాష్ట్ర అజెండా మారుస్తా: కవిత
Kalvakuntla Kavitha

హైదరాబాద్: రాష్ట్ర అజెండా మారాల్సిన అవసరం ఉందని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయకుండానే మళ్లీ అధికారంలోకి వస్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలలు కంటున్నారని ఆమె విమర్శించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు నిధులు లేవని చెబుతూ, మరోవైపు మూసీ ప్రాజెక్టుకు లక్ష కోట్ల రూపాయలు ఖర్చు చేస్తామని చెప్పడం ఏమిటని ప్రశ్నించారు.


తెలంగాణ ఏర్పడి 12 సంవత్సరాలు గడిచినా పేద ప్రజల జీవితాల్లో ఆశించిన మార్పు రాలేదని కవిత అన్నారు. వారి జీవన ప్రమాణాలను మెరుగుపర్చాలనే సంకల్పంతోనే తెలంగాణ రక్షణ సేనను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే పేదలపై ఆర్థిక భారం లేకుండా ఉచిత విద్య, ఉచిత వైద్యాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర అజెండా మారుస్తానన్నారు. పార్టీ కార్యకర్తలు, నాయకులు కష్టపడి పనిచేయాలని హార్డ్ వర్క్‌నే నమ్ముకోవాలని కవిత సూచించారు.


Also Read:

5 రోజులు శిథిలాల కిందే.. వైరల్‌గా మారిన కుక్క పిల్ల వీడియో..

కెప్టెన్ అవుతానని నాకెప్పుడో తెలుసు : శ్రేయస్ అయ్యర్

Updated Date - Jul 01 , 2026 | 06:37 PM