Share News

5 రోజులు శిథిలాల కిందే.. వైరల్‌గా మారిన కుక్క పిల్ల వీడియో..

ABN , Publish Date - Jul 01 , 2026 | 06:12 PM

వెనెజువెలాలో శిథిలాల కింద చిక్కుకుపోయిన మనుషులు, మూగ జీవాలను రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే జిసెల్లే అనే కుక్కపిల్లను సహాయక సిబ్బంది శిథిలాల కిందనుంచి బయటకు తీశారు. ఆ కుక్కపిల్ల 5 రోజులు శిథిలాల కింద నీళ్లు, ఆహారం లేకుండా అల్లాడిపోయింది.

5 రోజులు శిథిలాల కిందే.. వైరల్‌గా మారిన కుక్క పిల్ల వీడియో..
Venezuela Earthquake

ఇంటర్‌నెట్ డెస్క్: వెనెజువెలా రాజధాని కరాకస్‌తో పాటు చుట్టు పక్కల ప్రాంతాల్లో గత నెల 24వ తేదీన వరుస భూకంపాలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ భూకంపాల కారణంగా ఇప్పటివరకు 1,943 మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 10,571 మంది తీవ్రంగా గాయపడ్డారు. భవనాల శిథిలాల కింద ఇంకా వేలాది మంది చిక్కుకుపోయారు. ఈ నేపథ్యంలో మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేస్తోంది.


5 రోజులు శిథిలాల కిందే..

శిథిలాల కింద చిక్కుకుపోయిన మనుషులు, మూగ జీవాలను రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే జిసెల్లే అనే కుక్కపిల్లను సహాయక సిబ్బంది శిథిలాల కిందనుంచి బయటకు తీశారు. ఆ కుక్కపిల్ల 5 రోజులు శిథిలాల కింద నీళ్లు, ఆహారం లేకుండా అల్లాడిపోయింది. సహాయక సిబ్బంది దాన్ని బయటకు తీసిన వెంటనే సిరంజి ద్వారా ఆహారాన్ని అందించారు. ఆ కుక్కపిల్ల యజమానులు ఎవరన్నది తెలియరాలేదు. ప్రస్తుతం కుక్కపిల్లకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


ఆ వీడియోలో.. ‘తనను బయటకు తీసిన సహాయక సిబ్బంది ముఖాన్ని కుక్కపిల్ల ఎంతో ప్రేమతో నాకింది. శిథిలాల నుంచి పక్కకు తీసుకువచ్చిన తర్వాత వైద్య సిబ్బంది దానికి సిరంజితో ఆహారం అందించారు. అది ఎంతో వేగంగా ఆహారాన్ని తినసాగింది. ఇక, ఈ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘ఈ కుక్కపిల్ల నమ్మకానికి నిలువెత్తు నిదర్శనంగా మారింది’.. ‘ప్రాణం పోయే వరకు నమ్మకం కోల్పోకూడదని ఈ కుక్కపిల్ల మనకు నేర్పిస్తోంది’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి

కెప్టెన్ అవుతానని నాకెప్పుడో తెలుసు : శ్రేయస్ అయ్యర్

ఏపీలో త్వరలో అడ్వొకేట్ ప్రొటెక్షన్ యాక్ట్..

Updated Date - Jul 01 , 2026 | 06:22 PM