పసుపు క్వింటాల్‌కు కనీస మద్దతు ధర ప్రకటించాలి: టీఆర్ఎస్ చీఫ్ కవిత
ABN , Publish Date - May 01 , 2026 | 09:12 PM
పసుపును ఆహార పంటగా గుర్తించి క్వింటాల్‌కు రూ.16 వేలు కనీస మద్దతు ధర ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు.
హైదరాబాద్, మే01: పసుపును ఆహార పంటగా గుర్తించి క్వింటాల్‌కు రూ.16 వేలు కనీస మద్దతు ధర ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. శుక్రవారం హైదరాబాద్‌లో కల్వకుంట్ల కవిత విలేకర్లతో మాట్లాడుతూ.. సాంగ్లీ మార్కెట్‌లో క్వింటాల్ పసుపు ధర రూ.17 వేలుగా ఉందన్నారు. కానీ నిజామాబాద్‌లో మాత్రం క్వింటాల్ పసుపు ధర రూ.13 వేలకే పరిమితమైందని ఆవేదన వ్యక్తం చేశారు.
వ్యాపారులు సిండికేట్‌గా మారడం వల్లే ఈ పరిస్థితులు వచ్చాయని ఆమె ఆరోపించారు. పసుపు రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. స్పైసెస్ బోర్డు బలోపేతం చేయాలని ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నిజామాబాద్, జగిత్యాల, నిర్మల్ రైతులకు అండగా ఉండాలన్నారు.
లక్ష క్వింటాళ్ల పసుపు కొనుగోలు పెండింగ్‌లో ఉందని ఈ సందర్భంగా ఆమె వెల్లడించారు. పసుపునకు కనీస మద్దతు ధర లేక సాగు విస్తీర్ణం తగ్గుతోందని టీఆర్ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తెలిపారు. ఈ నామ్ 2.0లో రైతులకు సాంకేతిక ఇబ్బందులు ఉన్నాయన్నారు. పసుపు రైతులను ఆదుకోవాలని కేంద్రానికి ఆమె డిమాండ్ చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కొద్ది రోజుల్లో శంకర్ విలాస్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు వేగవంతం: కేంద్ర మంత్రి పెమ్మసాని
ఫామ్‌హౌస్ అడ్డాగా సీఐ చిన్నమల్లయ్య రాసలీలలు.. వెలుగులోకి వీడియో..
For More AP News And Telugu News