Share News

ఇన్‌స్టాలో పరిచయమైన బాలికపై అత్యాచారం

ABN , Publish Date - Oct 02 , 2026 | 06:51 AM

ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పరిచయమైన 16 ఏళ్ల బాలికకు ప్రేమ పేరుతో దగ్గరై, పెళ్లి చేసుకుంటానని నమ్మించి అత్యాచారానికి పాల్పడిన ఓ బాలుడిపై పోక్సో కేసు నమోదైంది.

ఇన్‌స్టాలో పరిచయమైన బాలికపై అత్యాచారం
POCSO Case

కవాడిగూడ అక్టోబరు 1 (ఆంధ్రజ్యోతి): ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పరిచయమైన 16 ఏళ్ల బాలికకు ప్రేమ పేరుతో దగ్గరై, పెళ్లి చేసుకుంటానని నమ్మించి అత్యాచారానికి పాల్పడిన ఓ బాలుడిపై పోక్సో కేసు నమోదైంది. హైదరాబాద్‌లోని సనత్‌నగర్‌ ప్రాంతంలోని ఓ హోటల్‌లో పని చేస్తున్న బాలుడికి ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా బాధితురాలు పరిచయమైంది. ఆ పరిచయం ప్రేమగా మారగా ఇరువురు చాలాసార్లు బయట కలుసుకున్నారు.


ఈ క్రమంలో పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆ బాలికపై బాలుడు పలుమార్లు అత్యాచారం చేశాడు. కొంతకాలం తర్వాత ఆ బాలుడు ముఖం చాటేశాడు. విషయం తెలుసుకున్న బాలిక కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు సదరు బాలుడిని అదుపులోకి తీసుకున్నారు.


ఇవి కూడా చదవండి...
ఎన్నికల కమిషన్‌, హైదరాబాద్‌ తగలబడిపోతయ్‌

ఎమ్మెల్సీ పదవులు ఎవరిని వరించునో!?

Read Latest Telangana News And Telugu News

Updated Date - Oct 02 , 2026 | 06:51 AM