Share News

నాకు కొడుకు కావాలి.. కూతుళ్లు వద్దు

ABN , Publish Date - Nov 22 , 2026 | 07:58 AM

‘‘నువ్వు నాకు నచ్చడం లేదు.. నాకు కొడుకు కావాలి, కూతుళ్లు వద్దు. అందుకే నీకు తలాక్‌ ఇస్తున్నాను. మా అమ్మ, చెల్లికి కూడా నువ్వు, కూతుళ్లు నచ్చలేదు. తలాక్‌, తలాక్‌, తలాక్‌’’ అంటూ హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి తన భార్యకు ఫోన్‌లో మెసేజ్‌ ద్వారా ట్రిపుల్‌ తలాక్‌ చెప్పాడు.

నాకు కొడుకు కావాలి.. కూతుళ్లు వద్దు

  • భార్యకు ఫోన్‌లో ట్రిపుల్‌ తలాక్‌ చెప్పిన భర్త

సైదాబాద్‌, నవంబరు 21 (ఆంధ్రజ్యోతి): ‘‘నువ్వు నాకు నచ్చడం లేదు.. నాకు కొడుకు కావాలి, కూతుళ్లు వద్దు. అందుకే నీకు తలాక్‌ ఇస్తున్నాను. మా అమ్మ, చెల్లికి కూడా నువ్వు, కూతుళ్లు నచ్చలేదు. తలాక్‌, తలాక్‌, తలాక్‌’’ అంటూ హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి తన భార్యకు ఫోన్‌లో మెసేజ్‌ ద్వారా ట్రిపుల్‌ తలాక్‌ చెప్పాడు. ఈ మేరకు బాధిత మహిళ శనివారం సైదాబాద్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సైదాబాద్‌ లోకాయుక్తా కాలనీలకి చెందిన నిషాంత్‌ ఆఫ్రీన్‌ (37)కు, మలక్‌పేటలోని సలీంనగర్‌కు చెందిన మహ్మద్‌ అలీ అర్షద్‌ (40)తో ఆగస్టు 2015లో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.


ఇద్దరి మధ్య మరస్పర్థలు తలెత్తడంతో కొంతకాలంగా కేసులు నడుస్తున్నాయి. ఈక్రమంలో గత నెల 24న రాత్రి ఆఫ్రీన్‌కు అర్షద్‌ ఫోన్‌ చేసి డిసెంబరులోగా కేసులు వాపస్‌ తీసుకోవాలని లేకపోతే తనను వదిలేస్తానని చెప్పాడు. ఆ మరుసటి రోజే ట్రిపుల్‌ తలాక్‌ సందేశం పంపాడు. ఈ మేరకు పోలీసులను ఆశ్రయించిన ఆ మహిళ.. తన అత్త సహానా బేగం, ఆడపడుచు అర్షియా తనపై కక్షతో తన భర్తను ప్రేరేపించి తనకు విడాకులు ఇప్పించారని ఫిర్యాదు చేసింది.


ఈ వార్తలనూ చదవండి:

హెలికాప్టర్ల నుంచి తూటాల వర్షం.. కరుడుగట్టిన గ్యాంగ్‌‌స్టర్ అరెస్టు

పారిశ్రామిక విప్లవం కంటే ఏఐ విప్లవమే పెద్దది.. ఆంథ్రోపిక్ ఐపీఓపై ట్రంప్ ప్రశంసలు..

Updated Date - Nov 22 , 2026 | 08:01 AM