బీజేపీ పాదయాత్రలో అమిత్ షా.. నగరంలో నేడు ట్రాఫిక్ ఆంక్షలు
ABN , Publish Date - Nov 02 , 2026 | 06:54 AM
హైదరాబాద్‌లో నేడు బీజేపీ ఆధ్వర్యంలో మహా పాదయాత్ర జరగనుంది. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు పోలీసులు వెల్లడించారు.
హైదరాబాద్, నవంబర్ 02: నగరంలో నేడు బీజేపీ ఆధ్వర్యంలో మహా పాదయాత్ర జరగనుంది. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు పోలీసులు వెల్లడించారు. సోమవారం మధ్యాహ్నం 1.00 నుంచి 7.00 గంటల వరకు ఈ ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని తెలిపారు. బాబు జగ్జీవన్ రాం (బీజేఆర్) విగ్రహం నుంచి ఎంజే మార్కెట్ వరకు ఈ పాదయాత్ర జరగనుంది. దీంతో బీజేఆర్ విగ్రహం, లిబర్టీ, బషీర్‌బాగ్, ఎంజే మార్కెట్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని పోలీసులు వివరించారు.
ట్రాఫిక్ ఆంక్షలు ఇలా..
ఏఆర్ పెట్రోల్ పంప్ నుంచి బీజేఆర్ విగ్రహం వైపు వచ్చే వాహనాలు నాంపల్లి రైల్వే స్టేషన్ వైపు మళ్లిస్తారు.
జాంబాగ్, అఫ్జల్‌గంజ్ నుంచి జీపీఓ వైపు వచ్చే వాహనాలు ఎంజే మార్కెట్ వద్ద తాజ్ ఐలాండ్ వైపు మళ్లిస్తారు.
లిబర్టీ నుంచి బీజేఆర్ విగ్రహం వైపు వచ్చే వాహనాలను అనుమతి లేదు. వాటిని హిమాయత్‌నగర్ వైపు మళ్లిస్తారు.
హిమాయత్‌నగర్ నుంచి వచ్చే వాహనాలు లిబర్టీ వద్ద పాత అంబేద్కర్ విగ్రహం, ట్యాంక్‌బండ్ వైపు మళ్లిస్తారు.
బషీర్‌బాగ్, కింగ్‌కోఠి, బొగ్గులకుంట, అబిడ్స్ పరిసరాల్లోనూ ట్రాఫిక్ మళ్లిస్తారు.
ఎంజే మార్కెట్ నుంచి జీపీఓ, నాంపల్లి స్టేషన్ రోడ్డు వైపు వాహనాలకు అనుమతి లేదు..
జీపీఓ నుంచి ఎంజే మార్కెట్ వైపు వాహనాల రాకపోకలు నిలిపివేత.
లిబర్టీ, రవీంద్రభారతి, బషీర్‌బాగ్, బీజేఆర్ విగ్రహం జంక్షన్ల వైపు వెళ్లవద్దని సూచన.
ఎంజే మార్కెట్, అఫ్జల్‌గంజ్, జాంబాగ్, తాజ్ ఐలాండ్ పరిసరాల్లో ట్రాఫిక్ రద్దీ ఏర్పడే అవకాశం ఉంది.
నాంపల్లి, అబిడ్స్, రామ్‌కోటి, కోఠి, చాదర్‌ఘాట్ మార్గాల్లోనూ ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయి.
ఆర్టీసీ బస్సుల రూట్లలోనూ మార్పులు.. ప్రత్యామ్నాయ మార్గాల్లో బస్సుల మళ్లిస్తారు.
నాంపల్లి, కాచిగూడ రైల్వేస్టేషన్లకు వెళ్లే ప్రయాణికులు ముందుగానే బయలుదేరాలని సూచన.
ఎయిర్‌పోర్టుకు వెళ్లే ప్రయాణికులు ప్రయాణ సమయాన్ని ముందుగానే ప్లాన్ చేసుకోవాలని సూచన.
ఈ వార్తలు కూడా చదవండి..
మేడిగడ్డను సందర్శించిన మహారాష్ట్ర సీఎస్
డీఎస్‌వో శ్రీకాంత్‌రెడ్డికి 14 రోజుల రిమాండ్
For More TG News And Telugu News