Share News

అలర్ట్.. అబిడ్స్ ఇస్కాన్ టెంపుల్ మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు

ABN , Publish Date - Sep 03 , 2026 | 09:12 PM

కృష్ణాష్టమి సందర్భంగా హైదరాబాద్‌లో అబిడ్స్‌లోని ఇస్కాన్ ఆలయానికి వెళ్లే మార్గా్ల్లో రద్దీ దృష్ట్యా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.

అలర్ట్.. అబిడ్స్ ఇస్కాన్ టెంపుల్ మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు

ఇంటర్నెట్ డెస్క్: కృష్ణాష్టమి సందర్భంగా హైదరాబాద్‌లోని అబిడ్స్‌లో ఇస్కాన్ ఆలయాన్ని సర్వాంగసుందరంగా ముస్తాబుచేశారు. కృష్ణుడు జన్మించిన ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని ఘనంగా వేడుకలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 4న తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి సెప్టెంబర్ 5 అర్ధరాత్రి వరకు అబిడ్స్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ మేరకు జాయింట్ సీపీ జోయెల్ డేవిస్ ఆదేశాలు జారీ చేశారు.


కృష్ణాష్టమిని పురస్కరించుకుని అబిడ్స్‌ ఇస్కాన్ ఆలయానికి అధిక సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్నట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు. అబిడ్స్ పరిసర ప్రాంతాల్లో రద్దీని బట్టి గన్‌ఫౌండ్రీ, తిలక్ రోడ్, జాంబాగ్, ఎస్.ఎ. బజార్ నుంచి అబిడ్స్ వైపు వెళ్లే వాహనాలను ఎంజే మార్కెట్, గాంధీభవన్ వైపు మళ్లిస్తామని సీపీ జోయెల్ తెలిపారు. బషీర్‌బాగ్, లిబర్టీ, రవీంద్ర భారతి, అఫ్జల్‌గంజ్ నుంచి అబిడ్స్ వైపు వెళ్లే ఆర్టీసీ బస్సులను బిజేఆర్ సర్కిల్, ఏఆర్ పెట్రోల్ పంప్, నాంపల్లి రోడ్ మీదుగా మళ్లిస్తామని ఆయన తెలిపారు.


ఆలయానికి వచ్చే భక్తుల వాహనాల పార్కింగ్ కోసం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు సీపీ జోయెల్ డేవిస్ తెలిపారు. అత్యవసర సమయాల్లో సహాయం కోసం హైదరాబాద్ ట్రాఫిక్ హెల్ప్‌ లైన్ నంబర్‌ను సంప్రదించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.


Also Read:

స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం చంద్రబాబు డిన్నర్ మీట్..

ఎల్‌నినోపై కేబినెట్‌ అప్రమత్తం.. అమరావతికి పెద్దపీట

రోహిత్‌ శర్మ రిటైర్‌మెంట్‌పై క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ

Updated Date - Sep 03 , 2026 | 09:12 PM