Share News

నకిలీ నంబర్ ప్లేట్లపై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల ఉక్కుపాదం

ABN , Publish Date - Jul 15 , 2026 | 05:02 PM

నకిలీ వాహన నంబర్ ప్లేట్లపై హైదరాబాద్ నగర ట్రాఫిక్ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. గత వారం రోజుల వ్యవధిలో నకిలీ నంబర్ ప్లేట్లు ఉపయోగించిన వారిపై ఐదు క్రిమినల్ కేసులను పోలీసులు నమోదు చేశారు.

నకిలీ నంబర్ ప్లేట్లపై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల ఉక్కుపాదం

హైదరాబాద్, జులై 15: నకిలీ వాహన నంబర్ ప్లేట్లపై హైదరాబాద్ నగర ట్రాఫిక్ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. గత వారం రోజుల వ్యవధిలో నకిలీ నంబర్ ప్లేట్లు ఉపయోగించిన వారిపై ఐదు క్రిమినల్ కేసులను పోలీసులు నమోదు చేశారు. జూబ్లీహిల్స్, మలక్‌పేట్, బేగంబజార్, అబిడ్స్, కాచిగూడ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఈ కేసులు నమోదయ్యాయి. ఈ ప్రత్యేక తనిఖీల్లో పలు వాహనాలను పోలీసులు సీజ్ చేశారు. 'జీరో టాలరెన్స్' విధానాన్ని అమలు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.


ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే క్రిమినల్ కేసుతో పాటు వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు. వాహనాలపై తప్పనిసరిగా హెచ్‌ఎస్‌ఆర్‌పీ (HSRP) ఉండాలని స్పష్టం చేశారు. హైదరాబాద్ నగరవ్యాప్తంగా ప్రత్యేక తనిఖీలను నిర్వహిస్తామని తెలిపారు. వాహనదారులు ట్రాఫిక్ రూల్స్ తప్పనిసరిగా పాటించాలని పోలీసులు స్పష్టం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఈనెలలోనే 50 నామినేటెడ్ పోస్టుల భర్తీ.. మహేశ్ గౌడ్ కీలక ప్రకటన

ఫ్యూచర్ సిటీకి స్టెప్పింగ్ స్టోన్‌‌గా అమెజాన్ డేటా సెంటర్: సీఎం రేవంత్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jul 15 , 2026 | 06:04 PM