వాహనదారులకు అలర్ట్.. కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ ఆంక్షలు
ABN , Publish Date - Apr 03 , 2026 | 08:36 PM
నగరవాసులకు ట్రాఫిక్ పోలీసులు కీలక సూచన చేశారు. హైదరాబాద్‌లో అత్యంత రద్దీగా ఉండే జూబ్లీహిల్స్ కేబీఆర్ పార్క్ పరిసరాల్లో ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి జీహెచ్ఎంసీ చేపట్టిన స్టీల్ ఫ్లైఓవర్, అండర్‌పాస్ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి.
హైదరాబాద్, ఏప్రిల్3: నగరవాసులకు ట్రాఫిక్ పోలీసులు కీలక సూచన చేశారు. హైదరాబాద్‌లో అత్యంత రద్దీగా ఉండే జూబ్లీహిల్స్ కేబీఆర్ పార్క్ పరిసరాల్లో ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి జీహెచ్ఎంసీ చేపట్టిన స్టీల్ ఫ్లైఓవర్, అండర్‌పాస్ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ట్రాఫిక్ నియమాల్లో తాత్కాలిక మార్పులు చేయడం జరుగుతోందని హైదరాబాద్ జాయింట్ సీపీ (ట్రాఫిక్) జోయెల్ డెవిస్ తెలిపారు. ఈ నెల 5వ తేదీ(ఆదివారం) ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు (మొత్తం 3 గంటల పాటు) కేబీఆర్ పార్క్ చుట్టూ వన్ - వే ట్రాఫిక్ నిబంధనలను ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నారు. భవిష్యత్‌లో శాశ్వతంగా అమలు చేయబోయే ట్రాఫిక్ మళ్లింపులపై పట్టు సాధించేందుకే ఈ ట్రయల్ రన్ నిర్వహిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
పంజాగుట్ట నుండి వచ్చే వాహనాలు మాదాపూర్‌కు వెళ్లేందుకు గాను రోడ్ నెంబర్-2 లో డైవర్షన్ తీసుకోవాలి. అటు నుంచి ఇందిరానగర్, జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్-5, రోడ్ నెంబర్-10 మీదుగా రోడ్ నెంబర్-45 కు చేరుకని మాదాపూర్ వైపు వెళ్లాల్సి ఉంటుంది.
మాదాపూర్ రోడ్ నెంబర్-45 నుంచి పంజాగుట్ట వైపు వచ్చే వాహనాలను జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ మీదుగా కేబీఆర్ పార్క్ ముందు నుంచి వన్ వేలో భాగంగా రోడ్డు నెంబర్-2 వైపునకు మళ్లించనున్నారు.
రోడ్ నెంబర్ -10, 12 నుండి వచ్చే వాహనాలన్నీ అగ్రసేన్ మహారాజ్ జంక్షన్ నుంచి జర్నలిస్ట్ కాలనీ, బాలకృష్ణ ఇంటి ముందు నుంచి జూబ్లీ చెక్ పోస్ట్ మీదుగా కేబీఆర్ పార్కు చేరుకునే విధంగా రూట్ మ్యాప్‌ను సిద్ధం చేశారు.
హైదరాబాద్ ప్రజలందరికీ హైదరాబాద్ ట్రాఫిక్ అడ్వైజరీలో భాగంగా తెలియజేస్తున్న సూచనలను పాటించి ప్రజలంతా సహకరించాలి కోరారు.
ఈ వార్తలు కూడా చదవండి
గిరిజనులకు కాంగ్రెస్ చేసింది గుండు సున్నా: ఎమ్మెల్యే హరీశ్ రావు..
బీఆర్‌ఎస్ ఖాళీ.. బీజేపీకి చోటు లేదు: టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ ధ్వజం