ఒంటరి వృద్ధులే టార్గెట్.. ఫిల్మ్‌నగర్ సీరియల్ కిల్లర్ అరెస్ట్
ABN , Publish Date - Mar 30 , 2026 | 08:32 AM
ఫిల్మ్‌నగర్ లో వరుసగా వృద్ధురాళ్లు అదృశ్యమవుతున్న కేసులో పోలీసులు పురోగతి సాధించారు. వెన్నుల్లో వణుకు పుట్టించే నిజాలను.. ఈ కేసులో పోలీసులు బయటపెట్టారు.
హైదరాబాద్, మార్చి 30: ఫిల్మ్‌నగర్‌లో వరుసగా వృద్ధురాళ్లు అదృశ్యమవుతున్న కేసులో పోలీసులు పురోగతి సాధించారు. వెన్నులో వణుకు పుట్టించే నిజాలను.. ఈ కేసులో పోలీసులు వెల్లడించారు. కేవలం చెవి కమ్మల కోసం ఒంటరి వృద్ధ మహిళలను టార్గెట్ చేసుకొని హత్య చేస్తున్న సీరియల్ కిల్లర్ వాసును పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నెల 11వ తేదీన యాదమ్మ అనే వృద్ధురాలు అదృశ్యం కావడంతో ఈ మిస్టరీ వెలుగులోకి వచ్చింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు. సీసీ టీవీ దృశ్యాలను పరిశీలించగా.. యాదమ్మ ఒక కారులో ఎక్కి వెళ్లడం కనిపించింది. ఆ కారు డ్రైవర్ వాసును అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారించగా.. దారుణాలన్నీ ఒక్కొక్కటిగా బయటపెట్టాడు.
ఒంటరిగా ఉన్న వృద్ధురాళ్లకు మాయమాటలు చెప్పి తన కారులో ఎక్కించుకునే నిందితుడు.. వారిని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి హత్యచేసేవాడు. కేవలం చెవి కమ్మలను దోచుకోవడమే వాసు ప్రధాన లక్ష్యం. ఈ నెల 11న యాదమ్మను కారులో తీసుకెళ్లి నిర్మానుష్య ప్రాంతంలో చంపేసినట్లు ఒప్పుకొన్నాడు. యాదమ్మ మాత్రమే కాదు.. గతంలో జూబ్లీహిల్స్ పరిధిలో జరిగిన మరో వృద్ధురాలిని కూడా ఇలాగే హత్య చేసినట్లు అంగీకరించాడు. అమాయక వృద్ధులను పొట్టనబెట్టుకున్న వాసును కఠినంగా శిక్షించాలని.. అతనికి ఉరిశిక్ష పడేలా చూడాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
డ్రగ్స్ రహిత రాష్ట్రమే లక్ష్యం... విజయ్ ఎన్నికల మేనిఫెస్టో
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు వేసిన స్పీకర్..