Share News

బియ్యం వ్యాపారంలో అక్రమాలు.. కొరడా ఝళిపించిన పౌరసరఫరాల శాఖ

ABN , Publish Date - Nov 02 , 2026 | 09:37 PM

బియ్యం అక్రమ వ్యాపారంపై పౌరసరఫరాల శాఖ కొరడా ఝళిపించింది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహించి 18 వ్యాపార సంస్థలపై చర్యలు తీసుకుంది.

బియ్యం వ్యాపారంలో అక్రమాలు.. కొరడా ఝళిపించిన పౌరసరఫరాల శాఖ

హైదరాబాద్, నవంబర్ 2: బియ్యం అక్రమ వ్యాపారంపై పౌరసరఫరాల శాఖ కొరడా ఝళిపించింది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహించి 18 వ్యాపార సంస్థలపై చర్యలు తీసుకుంది. 11 ఎఫ్ఐఆర్‌లూ నమోదు చేసింది. అక్టోబర్ 29 నుంచి 31 వరకు ఈటీఎఫ్, లీగల్ మెట్రాలజీ సంయుక్త తనిఖీలు చేపట్టాయి. ఈ క్రమంలో 25 కిలోల బియ్యం బస్తాపై 26 కిలోల లేబుల్ వేసి మోసాలకు పాల్పడిన వ్యాపారులను గుర్తించాయి.


ఈ తనిఖీల్లో అడ్డదారుల్లో సాగుతున్న వ్యాపారాలు బయటపడ్డాయి. కొందరు వ్యాపారులు ఎమ్మార్పీపై అధిక ధరల స్టిక్కర్లు వేసి బియ్యం బస్తాలు విక్రయిస్తున్నారు. ఇంకొందరు జీఎస్టీ, ఎఫ్ఎస్ఎస్ఏఐ సహా లైసెన్సులు లేకుండానే వ్యాపారాలు చేస్తున్నారు. కొంతమంది రేషన్ డీలర్లు బియ్యాన్ని అక్రమంగా నిల్వ చేస్తూ పక్కదారి పట్టిస్తున్నారు. వీరందరిపై పౌరసరఫరాల శాఖ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సరూర్‌నగర్, జీడిమెట్ల, అల్వాల్ పోలీస్ స్టేషన్లలో నిత్యావసర వస్తువుల చట్టం కింద కేసులు నమోదు చేసింది. బియ్యం కొరత సృష్టించి ధరలు పెంచితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. నేరం రుజువైతే ఏడేళ్ల వరకు ఈ వ్యాపారులకు జైలు శిక్ష పడుతుంది.


ఈ వార్తలూ చదవండి

తెలంగాణలో కాంగ్రెస్‌ను కూకటివేళ్లతో పెకిలిస్తాం.. మహా పాదయాత్రలో అమిత్ షా

హైదరాబాద్ మెట్రో ఫేజ్‌-2కు రూ.150 కోట్ల నిధుల మంజూరు

Updated Date - Nov 02 , 2026 | 09:37 PM