Share News

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. హైదరాబాద్‌ సిటీ పోలీస్‌ పరిధిలో భారీ పునర్వ్యవస్థీకరణ..

ABN , Publish Date - Oct 01 , 2026 | 07:58 PM

హైదరాబాద్‌ సిటీ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో తెలంగాణ ప్రభుత్వం భారీ స్థాయిలో పునర్వ్యవస్థీకరణ చేపట్టింది. పోలీస్‌ జోన్లు, డివిజన్లు, పోలీస్‌స్టేషన్ల పరిధులను పునర్విభజిస్తూ నిర్ణయం తీసుకుంది.

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. హైదరాబాద్‌ సిటీ పోలీస్‌ పరిధిలో భారీ పునర్వ్యవస్థీకరణ..
Hyderabad City Police

ఇంటర్నెట్ డెస్క్: హైదరాబాద్‌ సిటీ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో తెలంగాణ ప్రభుత్వం భారీ స్థాయిలో పునర్వ్యవస్థీకరణ చేపట్టింది. పోలీస్‌ జోన్లు, డివిజన్లు, పోలీస్‌స్టేషన్ల పరిధులను పునర్విభజిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మొత్తం 76 ప్రాంతాలకు సంబంధించి పరిధుల్లో మార్పులు చేసింది. పరిపాలనా సౌలభ్యం, పోలీసింగ్‌ను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు పలు పోలీస్‌స్టేషన్ల పరిధులను ఇతర జోన్లు, డివిజన్లకు అధికారులు బదిలీ చేశారు. ముఖ్యంగా మార్కెట్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఉన్న పలు ప్రాంతాలను మల్కాజిగిరి కమిషనరేట్‌ పరిధిలోకి తెచ్చారు.


శంషాబాద్‌ డివిజన్‌లోనూ పోలీస్‌స్టేషన్ల పరిధులను అధికారులు పునర్వ్యవస్థీకరించారు. ఆర్జీఐఏ పోలీస్‌స్టేషన్‌ పేరును శంషాబాద్‌ పోలీస్‌స్టేషన్‌గా మార్చడంతో పాటు మహేశ్వరం, శంషాబాద్‌, సైబరాబాద్‌ పరిధుల్లోనూ మార్పులు చేశారు. శంషాబాద్‌ డివిజన్‌లోని ఆర్జీఐఏ పీఎస్‌, శంషాబాద్‌ పీఎస్‌లను పునర్వ్యవస్థీకరించారు. అలాగే రాజేంద్రనగర్‌ పీఎస్‌ పరిధిలోని పలు ప్రాంతాల్లోనూ మార్పులు చేశారు. అబ్దుల్లాపూర్‌మెట్‌, మీర్‌పేట్‌ ప్రాంతాల పోలీస్‌ పరిధుల్లో మార్పులు జరిగాయి. జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, సనత్‌నగర్‌ ప్రాంతాల్లోనూ పరిధుల పునర్విభజన జరిగింది.


ట్రాఫిక్‌ పోలీస్‌ పరిధిలోనూ జోన్లు, డివిజన్లను పునర్వ్యవస్థీకరించారు. ఉమెన్‌ సేఫ్టీ వింగ్‌ పరిధిలోనూ కొత్తగా జోన్లు కేటాయించారు. జోనల్‌ సైబర్‌ సెల్‌ పరిధులనూ పునర్వ్యవస్థీకరించారు. ఈ మేరకు G.O.Ms.No.84 ద్వారా పునర్వ్యవస్థీకరణకు కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆమోదం తెలిపింది.


ఈ వార్తలు కూడా చదవండి

సాయి తేజ మృతి ఘటనపై ఎన్‌హెచ్‌ఆర్‌సీ సీరియస్.. విద్యాశాఖ ముఖ్య కార్యదర్శికి నోటీసులు..

హైదరాబాద్‌కు ఎంఎస్ ధోనీ దంపతులు.. సెల్ఫీల కోసం ఎగపడిన అభిమానులు..

Updated Date - Oct 01 , 2026 | 07:58 PM