పోక్సో కేసులో నిందితుడికి 20 ఏళ్లు జైలు
ABN , Publish Date - Nov 21 , 2026 | 05:31 AM
అద్దెకు ఉంటున్న కుటుంబానికి చెందిన మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డ వ్యక్తికి శుక్రవారం న్యాయస్థానం 20 ఏళ్ల జైలు శిక్షతోపాటు రూ.6,100 జరిమానా విధించింది.
హైదరాబాద్ సిటీ, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): అద్దెకు ఉంటున్న కుటుంబానికి చెందిన మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డ వ్యక్తికి శుక్రవారం న్యాయస్థానం 20 ఏళ్ల జైలు శిక్షతోపాటు రూ.6,100 జరిమానా విధించింది. సరూర్‌నగర్ పోలీస్టేషన్ పరిధిలో నివసిస్తున్న పైడిపోగు రాజేష్ (27)కు ఈ శిక్ష వేసింది. ఆయన ఇంట్లో ఓ కుటుంబం అద్దెకు ఉంటోంది.
ఆ కుటుంబంలోని మైనర్ బాలికపై రాజేష్ లైంగిక దాడి చేశాడు. బాలికను పెళ్లి చేసుకుంటానని చెప్పిన రాజేష్ తర్వాత మాటమార్చాడు. నిందితుడిపై పోక్సోకేసు నమోదు చేసిన పోలీసులు చార్జ్‌షీట్ దాఖలు చేశారు. విచారణ జరిపిన ఎల్‌బీనగర్ కోర్టు 13వ అదనపు జడ్జి వాణి నిందితుడికి జైలు శిక్ష, జరిమానా విధించారు.
ఈ వార్తలనూ చదవండి:
భారత్‌కు పాక్ మంత్రి రాక.. మోదీ సర్కారుపై విపక్షాల విమర్శలు
తమిళనాడుకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ.. కావేరీ నీటి అభ్యర్థన తిరస్కరణ..