సైబరాబాద్, మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్లకు కొత్త కమిషనర్ల నియామకం..
ABN , Publish Date - Feb 11 , 2026 | 08:19 AM
తెలంగాణ ప్రభుత్వం జీహెచ్ఎంసీతో పాటు సైబరాబాద్, మల్కాజిగిరి కార్పొరేషన్లను ఏర్పాటు చేసింది. ఈ మున్సిపల్ కార్పొరేషన్లకు తాజాగా కొత్త కమిషనర్లను నియమించింది..
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) ను మూడు విభాగాలుగా విభజించింది. వీటిలో జీహెచ్ఎంసీతో పాటూ సైబరాబాద్, మల్కాజిగిరి కార్పొరేషన్లు ఉన్నాయి. ఈ మార్పులో భాగంగా, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే. రామకృష్ణారావు ఈ మూడు కార్పొరేషన్లకు కొత్త కమిషనర్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
జీహెచ్ఎంసీ కమిషనర్‌గా ఆర్వీ కర్ణన్ కొనసాగనున్నారు.
సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా సృజన నియమితులయ్యారు.
మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా వినయ్ కృష్ణారెడ్డి రెడ్డి నియమితులయ్యారు.
స్పెషల్ ఆఫీసర్‌గా జయేష్ రంజన్..
జీహెచ్ఎంసీ, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్లకు స్పెషలాఫీసర్‌గా జయేష్ రంజన్‌ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మూడు కార్పొరేషన్లకు ఎన్నికలు జరిగి.. కొత్త పాలక మండలి వచ్చే వరకూ ప్రత్యేకాధికారిగా జయేష్ రంజన్ కొనసాగనున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
బంగారం పెరిగింది.. వెండి తగ్గింది.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..
ఎవరికీ పట్టనివారు ఆమెకు కావల్సినవారు
Read Latest Telangana News and National News