డీప్‌ఫేక్, మార్ఫింగ్ ఫొటోలు బయటపెడతాం.. ఎంఐఎం ఎమ్మెల్సీకి బెదిరింపులు..
ABN , Publish Date - Aug 28 , 2026 | 08:12 AM
ఎంఐఎం ఎమ్మెల్సీ మీర్జా రెహ్మత్ బేగ్‌ను గుర్తుతెలియని వ్యక్తులు బెదిరించారు. పలుమార్లు ఫోన్ చేసిన దుండగులు డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
హైదరాబాద్: ఎంఐఎం ఎమ్మెల్సీ మీర్జా రెహ్మత్ బేగ్‌ను గుర్తుతెలియని వ్యక్తులు బెదిరించారు. పలుమార్లు ఫోన్ చేసిన దుండగులు డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అడిగినంత డబ్బు ఇవ్వకపోతే డీప్‌ఫేక్, మార్ఫింగ్ ఫొటోలు, వీడియోలను బయటపెడతామని బెదిరింపులకు దిగారు. డబ్బులు ఇవ్వకుంటే కుటుంబ పరువుతో పాటు రాజకీయంగానూ ఇబ్బందులు ఎదుర్కొనేలా చేస్తామని హెచ్చరించారు.
వరుస బెదిరింపు ఫోన్ కాల్స్‌తో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను మీర్జా రెహ్మత్ బేగ్ ఆశ్రయించారు. ఎమ్మెల్సీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. బెదిరింపు కాల్స్ ఎక్కడి నుంచి వచ్చాయి?, ఫోన్ చేసిన వ్యక్తులు ఎవరు? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఫోన్ నంబర్లు, ఇతర సాంకేతిక ఆధారాల ద్వారా నిందితులను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు.
ఈ వార్తలు కూడా చదవండి
అర్థం చేసుకునేవాళ్లు దొరికితేనే రెండో పెళ్లి
అనుబంధాల వేడుక.. నేడు రక్షాబంధన్..