పండుగ వేళ.. హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్..!
ABN , Publish Date - Nov 05 , 2026 | 12:15 PM
దీపావళి పండుగ వేళ.. హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్ చెప్పేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ మహానగరంలో మెట్రో రైలు, ఆర్టీసీ బస్సు ప్రయాణికులకు ఉమ్మడి పాస్ ధర గణనీయంగా తగ్గించేందుకు మెట్రో రైలు, ఆర్టీసీ అధికారుల మధ్య అవగాహన ఒప్పందం కుదిరినట్లు సమాచారం.
ఇంటర్నెట్ డెస్క్: దీపావళి పండుగ వేళ.. హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్ చెప్పేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ మహానగరంలో మెట్రో రైలు, ఆర్టీసీ బస్సు ప్రయాణికులకు ఉమ్మడి పాస్ ధర గణనీయంగా తగ్గించేందుకు మెట్రో రైలు, ఆర్టీసీ అధికారుల మధ్య అవగాహన ఒప్పందం కుదిరినట్లు సమాచారం. దీంతో ఈ పాస్ ధర రూ.4000 నుంచి రూ.4500గా నిర్ణయించే అవకాశం ఉంది. దీనిపై నేడో రేపో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజుతో ఆర్టీసీ ఎండీ వై నాగిరెడ్డి, మెట్రో రైలు సలహాదారు ఎన్వీఎస్ రెడ్డి సమావేశం కానున్నారు.
ఈ భేటీతో ఉమ్మడి పాస్ ధరలపై పూర్తి స్పష్టతతోపాటు అధికారిక ప్రకటన వెలువడుతుందని ఆర్టీసీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఈ ధరలను దీపావళి నుంచి అమల్లోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. ఈ ఒప్పందం అమల్లోకి వస్తే హైదరాబాద్ క్యూర్ (కోర్ అర్బన్ రీజియన్ ఎకానమి) ప్రాంతంలో వీటిలో ప్రయాణించే వారికి భారీ ఊరట కలగనుంది.
సగానికి సగం తగ్గనున్న ధర..
హైదరాబాద్‌లో మెట్రో రైలు, ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారి కోసం ఉమ్మడి పాస్‌ను ఈ ఏడాది సెప్టెంబర్‌లో తెలంగాణ ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ పాస్ ధర రూ.8,500గా నిర్ణయించింది. అయితే దీనికి అంతగా ప్రజల నుంచి ఆదరణ లభించ లేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం పునరాలోచనలో పడింది. దాంతో ఈ ధరను తగ్గిస్తే.. ప్రజాదరణ లభిస్తుందని ప్రభుత్వం ఆలోచనలో పడింది. ఆ దిశగా అడుగులు వేసింది. ఆ క్రమంలో ఉమ్మడి పాస్ ధరను సగానికి సగం తగ్గించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.
ఈ వార్తలు కూడా చదవండి..
పసిడి ప్రియులకు షాక్.. మరింత పెరిగిన బంగారం ధర
తిరుపతి లడ్డూ కేసు.. ఇతర రాష్ట్రాలకు విచారణ బదిలీకి సుప్రీంకోర్టు నో
For More TG News And Telugu News