కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సీఎం రేవంత్ మరో బహిరంగ లేఖ..
ABN , Publish Date - Jun 20 , 2026 | 07:43 PM
హైదరాబాద్ మెట్రో రైలు అంశంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరో బహిరంగ లేఖ రాశారు. హైదరాబాద్ మెట్రో పెండింగ్ అంశాల పరిష్కారానికి జోక్యం చేసుకోవాలని కిషన్ రెడ్డిని సీఎం రేవంత్ కోరారు.
ఇంటర్నెట్ డెస్క్: హైదరాబాద్ మెట్రో రైలు అంశంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరో బహిరంగ లేఖ రాశారు. మెట్రో పెండింగ్ అంశాల పరిష్కారానికి జోక్యం చేసుకోవాలని కిషన్ రెడ్డిని సీఎం రేవంత్ కోరారు. ఈ సందర్భంగా హైదరాబాద్ మెట్రో విస్తరణకు కేంద్రం సహకారం కావాలని అన్నారు. మెట్రో ఫేజ్-2, IRFC ఫైనాన్సింగ్‌పై చర్చకు సమావేశం ఏర్పాటు చేయాలని కేంద్రమంత్రికి సీఎం విజ్ఞప్తి చేశారు.
జూన్ 22, 23 తేదీల్లో తాను ఢిల్లీలో ఉంటానని, రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌తో భేటీకి సమయం కేటాయించాలని సీఎం రేవంత్ కోరారు. ఇద్దరం కలిసి రైల్వే మంత్రిని కలుద్దామని ప్రతిపాదించారు. సంబంధిత ఒప్పందాల పత్రాలతో సమావేశానికి హాజరవుతానని ముఖ్యమంత్రి చెప్పుకొచ్చారు. తెలంగాణకు హైదరాబాద్ మెట్రో కీలక మౌలిక వసతి ప్రాజెక్టని ఈ సందర్భంగా లేఖలో సీఎం పేర్కొన్నారు. దీనికి సంబంధించిన పెండింగ్ అంశాలకు త్వరితగతిన పరిష్కారం అవసరమని చెప్పుకొచ్చారు. కాగా, ఈనెల 16వ తేదీన కూడా హైదరాబాద్ మెట్రో రైలు అంశంపై కిషన్ రెడ్డికి రేవంత్ రెడ్డి లేఖ రాశారు.
ఈ సందర్భంగా సమస్య పరిష్కారానికి ఏ మీటింగ్‌కైనా తాను సిద్ధమేనని రేవంత్ అన్నారు. రైల్వే మంత్రితో వీలైనంత త్వరగా సమావేశం ఏర్పాటు చేయించాలన్నారు. ఆ సమావేశానికి సంబంధించి కిషన్ రెడ్డి పిలుపు కోసం తాను ఎదురు చూస్తానని పేర్కొన్నారు. ఇందుకు ఆయనతో వ్యక్తిగత భేటీకీ సిద్ధమేనని సీఎం రేవంత్ చెప్పుకొచ్చారు.
ఈ వార్తలు కూడా చదవండి
వీబీజీ రామ్‌జీ చట్టంపై కేంద్రానికి మంత్రి సీతక్క లేఖ
రాధాగాయత్రి కేసు.. సంచలన విషయాలు వెల్లడించిన స్నేహితులు