Share News

హైదరాబాద్- జైపూర్‌ రైలులో అగ్నిప్రమాదం..

ABN , Publish Date - May 15 , 2026 | 08:41 PM

హైదరాబాద్- జైపూర్‌ స్పెషల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలులో అగ్నిప్రమాదం జరిగింది. నాంపల్లి రైల్వేస్టేషన్ వద్ద నాలుగో నంబర్ ప్లాట్‌ఫామ్‌పై రైలు ఆగి ఉంది. అయితే, ప్రమాదవశాత్తూ ఏసీ కోచ్‌ B1, B2 బోగీల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

హైదరాబాద్- జైపూర్‌ రైలులో అగ్నిప్రమాదం..

హైదరాబాద్: హైదరాబాద్- జైపూర్‌ స్పెషల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలులో అగ్నిప్రమాదం జరిగింది. నాంపల్లి రైల్వేస్టేషన్ వద్ద నాలుగో నంబర్ ప్లాట్‌ఫామ్‌పై రైలు ఆగి ఉంది. అయితే, ప్రమాదవశాత్తూ ఏసీ కోచ్‌ B1, B2 బోగీల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మూడు ఫైరింజన్లతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం మంటలను అదుపులోకి తెచ్చారు. బోగీల్లో ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. కాగా, అగ్నిప్రమాదానికి గల కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు.


ఈ ప్రమాదంపై సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం సంజయ్ కుమార్ శ్రీవాత్సవ్ స్పందించారు. 'హైదరాబాద్ నుంచి జైపూర్‌కు వెళ్లే రైలు అగ్నిప్రమాదానికి గురైంది. ఫ్లాట్‌ఫామ్‌ పైకి రైలు వచ్చిన 10 నిమిషాల్లోనే B1 బోగీలో మంటలు చెలరేగాయి. ఆ మంటలు B2 బోగీకి వ్యాపించాయి. రైల్వే సిబ్బంది అప్రమత్తమై అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. మంటలు ఇతర బోగీలకి వ్యాపించకుండా ఆ రెండు బోగీలను రైలు నుంచి వేరు చేశారు. ఈ ప్రమాదంలో B1 బోగి పూర్తిగా, B2 బోగి పాక్షికంగా కాలిపోయింది. ప్రమాదం సంభవించినప్పుడు బోగీల్లో ఎవరు లేరు. నాలుగు గంటల్లో వేరే బోగీలు అమర్చి, యధావిథిగా రైలు సర్వీస్ కొనసాగిస్తాము. ప్రమాదానికి కారణం ఫోరెన్సిక్ నివేదిక వచ్చిన తర్వాత తెలియజేస్తాం' అని తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి

వాళ్లు బొద్దింకల్లా వ్యవస్థపై దాడి చేస్తున్నారు.. సీజేఐ అసహనం

నీట్ యూజీ పేపర్ లీక్ కేసులో కీలక నిందితుడి అరెస్టు..

Updated Date - May 15 , 2026 | 09:20 PM