ఏనుగు దంతాల విక్రయ ముఠా అరెస్టు
ABN , Publish Date - Oct 02 , 2026 | 06:17 AM
ఏనుగు దంతాలను విక్రయిస్తున్న ముగ్గురు సభ్యుల ముఠాను డైరెక్టరేట్ ఆఫ్ రెవిన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్‌ఐ) హైదరాబాద్ యూనిట్ అధికారులు గురువారం అదుపులోకి తీసుకున్నారు.
హైదరాబాద్/హైదరాబాద్ సిటీ, అక్టోబరు 1 (ఆంధ్రజ్యోతి): ఏనుగు దంతాలను విక్రయిస్తున్న ముగ్గురు సభ్యుల ముఠాను డైరెక్టరేట్ ఆఫ్ రెవిన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్‌ఐ) హైదరాబాద్ యూనిట్ అధికారులు గురువారం అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 17 కిలోల బరువున్న నాలుగు ఏనుగు దంతాలు, ఏనుగు దంతాలతో కళాత్మకంగా చెక్కిన ఐవరీ ట్రోఫీలను స్వాధీనం చేసుకున్నారు.
నిందితులపై అక్రమ రవాణా, స్మగ్లింగ్ కేసు నమోదు చేశామని డీఆర్‌ఐ అధికారులు వెల్లడించారు. దేశవ్యాప్తంగా వన్యప్రాణుల అక్రమ రవాణా, వ్యాపారంపై డీఆర్‌ఐ నిఘా కొనసాగిస్తోంది. ఈ ఏడాది జూలై వరకు 440కి పైగా రక్షిత, అంతరించిపోతున్న జంతువులు, సుమారు 15 కిలోల బరువున్న ఐవరీ ఉత్పత్తులను స్వాధీనం చేసుకుని 33 మంది నిందితులను అరెస్టు చేసింది.
ఇవి కూడా చదవండి...
నో మైనింగ్ జోన్‌గా ఫ్యూచర్ సిటీ!
వారంలోగా చెక్కులపై సంతకాలు చేయకుంటే చర్యలు
Read Latest Telangana News And Telugu News