హైదరాబాద్ మాదాపూర్‌లో గ్యాస్ సిలిండర్ల దొంగ అరెస్టు
ABN , Publish Date - Apr 01 , 2026 | 09:26 PM
హైదరాబాద్‌లోని మాదాపూర్ పరిధిలోని హోటల్లు, హాస్టళ్లను లక్ష్యంగా చేసుకుని గ్యాస్ సిలిండర్ల దొంగతనానికి పాల్పడుతున్న ఒక నేరస్తుడిని మాదాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు.
హైదరాబాద్, ఏప్రిల్ 1: హైదరాబాద్‌లోని మాదాపూర్ పరిధిలోని హోటల్లు, హాస్టళ్లను లక్ష్యంగా చేసుకుని గ్యాస్ సిలిండర్ల దొంగతనానికి పాల్పడుతున్న ఒక నేరస్తుడిని మాదాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి సుమార్ 31 కమర్షియల్ గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. సూర్యాపేట జిల్లాకు చెందిన సందీప్ కుమార్ రెడ్డి (24) నగరంలోని బాచుపల్లి సాయినగర్‌లో నివాసం ఉంటున్నాడు. వృత్తిరిత్యా ఫుడ్ డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. అయితే, గత కొంతకాలంగా ఆన్ లైన్ బెట్టింగ్ యాప్స్‌కు బానిసైన సందీప్.. ఆ వ్యసనం కోసం డబ్బు సంపాదించేందుకు దొంగతనాలను వృత్తిగా ఎంచుకున్నాడు.
సందీప్ రాత్రి సమయాల్లో హోటల్లు, హాస్టళ్ల వద్ద నిఘా ఉంచి, ఎవరూ లేని సమయంలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్లను దొంగిలించేవాడు. వాటిని విక్రయించి, వచ్చిన సొమ్ముతో ఆన్‌లైన్ బెట్టింగ్స్ ఆడేవాడు. ఒక్క మాదాపూర్ పరిధిలోనే కాకుండా, కేబీహెచ్‌బీ, కూకట్‌పల్లి, బాచుపల్లి, ఎస్.ఆర్. నగర్ వంటి కీలక ప్రాంతాల్లోనూ అనేక చోరీలకు పాల్పడినట్లు విచారణలో తేలింది.
వరుస దొంగతనాలపై ఫిర్యాదులు అందడంతో రంగంలోకి దిగిన మాదాపూర్ పోలీసులు, ఘటనా స్థలాల్లోని సీసీటీవీ ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలించారు. నిందితుడి ఫుటేజ్‌లను ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్ ద్వారా పరిశీలించారు. సందీప్ గతంలో కేబీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన పాత నేరస్తుడిగా గుర్తించారు. అతని వద్ద నుండి 31 సిలిండర్లను రికవరీ చేశారు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు.
ఈ వార్తలు కూడా చదవండి
తెలుగు రాష్ట్రాల్లో మండుతున్న ఎండలు
ఒంటిమిట్ట ఆలయం సమీపంలో అగ్నిప్రమాదం.. స్పందించిన సిబ్బంది