త్వరలో ఆటోల్లోనూ కామన్‌పాస్ సేవలు!
ABN , Publish Date - Oct 04 , 2026 | 06:28 AM
ఆర్టీసీ- మెట్రో రైలు కామన్ పాస్ ప్రయాణికులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఒకే పాస్‌తో మెట్రోను, ఆర్టీసీ బస్సులను వినియోగించుకునే అవకాశం ఉండటంతో ప్రయాణికులు గమ్యస్థానాలకు చేరుకునే సమయంలో ఇబ్బందులుండవని తెలిపారు.
హైదరాబాద్‌లో ఉబర్ వంటి అన్ని రవాణా వ్యవస్థలకు విస్తరిస్తాం: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
కామన్ పాస్‌తో ఆర్టీసీ, మెట్రోలో మంత్రులు పొన్నం, వివేక్, అజారుద్దీన్‌తో కలిసి ప్రయాణం
ప్రయాణికుల అభిప్రాయం మేరకు పాస్ ధరలను సమీక్షిస్తాం: పొన్నం
హైదరాబాద్ సిటీ, అక్టోబరు 3 (ఆంధ్రజ్యోతి): ఆర్టీసీ- మెట్రో రైలు కామన్ పాస్ ప్రయాణికులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఒకే పాస్‌తో మెట్రోను, ఆర్టీసీ బస్సులను వినియోగించుకునే అవకాశం ఉండటంతో ప్రయాణికులు గమ్యస్థానాలకు చేరుకునే సమయంలో ఇబ్బందులుండవని తెలిపారు. త్వరలో హైదరాబాద్‌లో ఇతర ప్రజా రవాణా వ్యవస్థలకు కూడా కామన్‌పా్‌స సేవలు విస్తరిస్తామని చెప్పారు. ఇటీవల ప్రవేశపెట్టిన ‘1 డే కామన్ పాస్’ అమలు తీరును స్వయంగా పరిశీలించేందుకు భట్టి విక్రమార్కతోపాటు మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి, అజారుద్దీన్, ఎంపీ చామల కిరణ్‌కుమార్ రెడ్డి, ఎమ్మెల్యేలు నవీన్‌యాదవ్, శ్రీగణే్‌షలు శనివారం ఉదయం బేగంపేట నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వరకు మెట్రో రైలులో ప్రయాణించారు. అనంతరం జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు నుంచి సచివాలయం వరకు ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు.
ఈ సందర్భంగా ప్రయాణికులతో భట్టి స్వయంగా మాట్లాడి కామన్ పాస్ వినియోగం ఎలా ఉంది..? ఏమైనా ఇబ్బందులు ఎదురవుతున్నాయా? అని ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వివిధ రకాల ప్రజా రవాణా విభాగాలను అనుసంధానం చేసి ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణ అనుభూతి కల్పించడ మే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఈ పాస్ ద్వారా ప్రస్తుతం మెట్రో- ఆర్టీసీ సేవలు అనుసంధానం చేశామని, భవిష్యత్తులో ఆటోలు, ఉబర్ వంటి ఇతర రవాణ సేవలను అనుసంధానం చేసే దిశగా ప్రభుత్వం ఆలోచిస్తోందని తెలిపారు. పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. గ్రేటర్ హైదరాబాద్‌లో ప్రజా రవాణా వ్యవస్థను మరింత సౌకర్యవంతంగా, సమర్థవంతంగా మార్చే లక్ష్యంతో కామన్ పాస్‌ను అందుబాటులోకి తెచ్చినట్లు చెప్పారు. ప్రయాణికుల అభిప్రాయం మేరకు కామన్ పాస్‌ల ధరలను సమీక్షిస్తామని తెలిపారు. ప్రజలను వ్యక్తిగత వాహనాల నుంచి ప్రజారవాణా వైపు మళ్లించేందుకు ఆర్టీసీ, మెట్రో సేవలను సమన్వయంతో అందించాల్సిన అవసరముందన్నారు. కార్యక్రమంలో రవాణా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికా్‌సరాజ్, మెట్రో ఎండీ సర్ఫరాజ్ అహ్మద్, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాగా, బేగంపేట మెట్రో స్టేషన్‌లో డిప్యూటీ సీఎం, మంత్రులు ఎక్కిన ఎస్కలేటర్ మధ్యలో నిలిచిపోయింది. దాంతో వారు మెట్ల మీది నుంచి నడుచుకుంటూ పైకి చేరుకున్నారు.
కామన్ పాస్ ధరలు తగ్గించాలి
నేను మేడిపల్లి నుంచి ఉప్పల్‌కు బస్సులో వచ్చేందుకు రూ.25 చార్జీ, ఉప్పల్ నుంచి బేగంపేట మెట్రోస్టేషన్‌కు వచ్చేందుకు రూ.55 ఖర్చవుతోంది. రోజూ ఆర్టీసీ, మెట్రోలో వచ్చి వెళ్లేందుకు రూ.160 అవుతుంది. నెలలో 24-25 రోజులు ఆఫీ్‌సకు వ చ్చి వెళ్లేందుకు రూ.3,840- 4,000 వరకు అవుతోంది. ఇప్పుడు కామన్ నెల పాస్‌కు రూ.8,500 ధర పెట్టారు. నేను ఆఫీ్‌సకు వెళ్లి వచ్చేందుకు రూ.4 వేలు మాత్రమే ఖర్చవుతుండగా రూ.8,500 పెట్టి పాస్ ఎందుకు తీసుకోవాలి? నెలవారీ కామన్‌పా్‌సను రూ.4-5 వేలకు అందిస్తే ప్రయాణికులకు ప్రయోజనకరంగా ఉంటుంది.
- శ్రీకాంత్, ప్రైవేటు ఉద్యోగి
ఇవి కూడా చదవండి...
గవర్నర్ కోటాలో రెండు ఎమ్మెల్సీలు బీసీలకే.. దసరా నాటికి 60 కార్పొరేషన్ల చైర్‌పర్సన్ల భర్తీ
గోదావరి ఫేజ్-2, 3 ప్రాజెక్టులకు రూ.2,944 కోట్ల హడ్కో రుణం.. రూ.59 కోట్ల గ్యారంటీ కమీషన్ మినహాయింపు
అపార్ట్‌మెంట్లకు ఫైర్ ఎన్‌వోసీ పరిమితి పెంపు.. 24 మీటర్ల వరకు అనుమతి