Share News

గోదావరి ఫేజ్‌-2, 3 ప్రాజెక్టులకు హడ్కో రుణం

ABN , Publish Date - Oct 04 , 2026 | 05:58 AM

హైదరాబాద్‌కు తాగునీటిని అందించడంతోపాటు జంట జలాశయాలైన ఉస్మాన్‌సాగర్‌, హిమాయత్‌సాగర్‌ను నింపి మూసీనదిని పునరుజ్జీవం చేసే గోదావరి ఫేజ్‌-2, ఫేజ్‌-3 ప్రాజెక్టుకు హడ్కో రుణం మంజూరైంది.

గోదావరి ఫేజ్‌-2, 3 ప్రాజెక్టులకు హడ్కో రుణం
HUDCO

  • గ్యారంటీ కమీషన్‌ మినహాయించిన సర్కార్‌

హైదరాబాద్‌ సిటీ, అక్టోబరు3 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌కు తాగునీటిని అందించడంతోపాటు జంట జలాశయాలైన ఉస్మాన్‌సాగర్‌, హిమాయత్‌సాగర్‌ను నింపి మూసీనదిని పునరుజ్జీవం చేసే గోదావరి ఫేజ్‌-2, ఫేజ్‌-3 ప్రాజెక్టుకు హడ్కో రుణం మంజూరైంది. రూ.2944 కోట్ల రుణం మంజూరుకు హడ్కో అంగీకరించి పలు షరతులు విధించింది. అయితే, వాటర్‌బోర్డు రుణ చెల్లింపులు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వానికి 2 శాతం గ్యారంటీ కమిషన్‌ చెల్లించాలని ముందుగా నిర్ణయించారు.


పలు విజ్ఞప్తుల మేరకు ప్రభుత్వం గ్యారంటీకి కమీషన్‌ మినహాయింపు ఇచ్చింది. ఈ మేరకు శనివారం మునిసిపల్‌ శాఖ ప్రత్యేక కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వానికి వాటర్‌బోర్డు 2శాతం కమీషన్‌ రూ.59 కోట్లను చెల్లించాల్సిన అవసరం లేదు. గోదావరిఫేజ్‌-2, ఫేజ్‌-3 ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం రూ.7360కోట్లతో హ్యామ్‌ పద్ధతిలో వాటర్‌బోర్డు చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనపరమైన అనుమతులిచ్చిన విషయం విదితమే.


ఇవి కూడా చదవండి...
తొలగించిన కులాల పేరిట 2,123 బీసీ సర్టిఫికెట్లు.. విచారణకు బీసీ కమిషన్‌ ఆదేశం

గౌరవెల్లి ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు సాధించాలి.. 98 శాతం పనులు పూర్తి: మంత్రి ఉత్తమ్‌
అపార్ట్‌మెంట్లకు ఫైర్‌ ఎన్‌వోసీ పరిమితి పెంపు.. 24 మీటర్ల వరకు అనుమతి

Updated Date - Oct 04 , 2026 | 06:48 AM