హైదరాబాద్‌లో భారీగా డ్రగ్స్ సీజ్..
ABN , Publish Date - Apr 28 , 2026 | 08:04 PM
హైదరాబాద్‌లోని సికింద్రబాద్ రైల్వే స్టేషన్, శంషాబాద్ ఎయిర్ పోర్టులో భారీగా డ్రగ్స్, విదేశీ గంజాయినీ కస్టమ్స్, డీఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్, ఏప్రిల్ 28: గంజాయి, డ్రగ్స్‌పై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతున్నా.. వీటి అక్రమ రవాణా మాత్రం ఆగడం లేదు. మంగళవారం హైదరాబాద్ మహానగరంలో భారీ ఎత్తున డ్రగ్స్, విదేశీ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో..
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో భారీ ఎత్తున డ్రగ్స్‌ను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటిలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు పట్టుకున్నారు. స్టేషన్‌లో ఇద్దరు మహిళల నుంచి 11.4 కిలోల నిషేధిత అంఫెటమైన్ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిద్దరినీ అరెస్ట్ చేసి.. విచారణ కోసం డీఆర్ఐ కార్యాలయానికి తరలించారు. స్వాధీనం చేసుకున్న ఈ డ్రగ్స్ విలువ రూ.11.40 కోట్లు ఉంటుందని డీఆర్ఐ అధికారులు తెలిపారు.
శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో..
సోమవారం బ్యాంకాక్ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న ప్రయాణికుడి వద్ద నుంచి 6.5 కేజీల విదేశీ గంజాయిని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ. 2.15 కోట్ల ఉంటుందని తెలిపారు. డీఆర్ఐ అధికారులు ఇచ్చిన ముందస్తు సమాచారం మేరకు శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో మాటు వేసి.. అతడిని పట్టుకున్నామని కస్టమ్స్ అధికారులు వివరించారు. ఎవరికీ అనుమానం రాకుండా లగేజ్ బ్యాగులో దాచి విదేశీ గంజాయిని తీసుకొచ్చినట్లు తెలిసింది. స్మగ్లర్‌పై ఎన్‌డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు కస్టమ్స్ అధికారులు వెల్లడించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
తెలంగాణ కొత్త డీజీపీగా సీవీ ఆనంద్
లొంగిపోయిన మావోయిస్టులకు తెలంగాణ పర్యాటక శాఖలో కొలువులు
For More TG News And Telugu News