చెత్తకుండిలో తగలబడిన మృతదేహం.. సీసీటీవీలో కీలక ఆధారాలు
ABN , Publish Date - Aug 07 , 2026 | 12:39 PM
దోమలగుడ గోశాల సమీపంలోని చెత్తకుండిలో తగలబడిన మృతదేహం కేసు దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. అందులోభాగంగా గోశాల సమీపంలో సీసీ టీవీ కెమెరాలను వారు జల్లెడ పట్టారు.
హైదరాబాద్, ఆగస్టు 07: దోమలగుడ గోశాల సమీపంలోని చెత్తకుండిలో తగలబడిన మృతదేహం కేసు దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. 30 నుంచి 35 ఏళ్ల మహిళ మృతదేహంగా గుర్తించారు. గోశాల సమీపంలో సీసీ టీవీ కెమెరాలను వారు జల్లెడ పట్టారు. ఈ సందర్భంగా చెత్తకుండీ సమీపంలో ఓ ఆటో పలుమార్లు అటు ఇటు తిరిగినట్లు సీసీ కెమెరాల్లో పోలీసులు గుర్తించారు. ఆటో నెంబర్‌తోపాటు డ్రైవర్ వివరాలను వారు ఆరా తీస్తున్నారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. వేరే ప్రాంతంలో మహిళను హత్య చేసి.. గోశాల సమీపంలోని చెత్తకుండీలో వేసి దహనం చేశారనే కోణంలో పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు.
గురువారం తెల్లవారుజామున గోశాల సమీపంలోని చెత్తకుండిలో మృతదేహం కాలుతున్నట్లు స్థానికులు గుర్తించారు. వారు వెంటనే అగ్నిమాపక సిబ్బందితోపాటు పోలీసులు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరిన వారు.. మంటలు అదుపు చేశారు. అనంతరం మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని.. పోస్ట్‌మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దీంతో గోశాల సమీపంలోని సీసీ టీవీ కెమెరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా చెత్తకుండి వద్ద ఒకే ఆటో రెండు సార్లు తిరిగినట్లు గుర్తించారు. ఆ దిశగా కేసు దర్యాప్తు చేపట్టారు.
ఇవి కూడా చదవండి...
జాతీయ చేనేత దినోత్సవం.. నేతన్నలకు సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు
ప్రతి భారతీయుడూ.. చేనేతకు అండగా నిలవాలి: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
Read Latest TG News And Telugu News