Share News

ఉద్యానవన శాస్త్రవేత్త శిఖామణికి కృషిరత్న అవార్డు

ABN , Publish Date - Nov 21 , 2026 | 06:13 AM

ఉద్యానవన రంగంలో విశేష పరిశోధనలు, సాంకేతిక ఆవిష్కరణలు చేసిన ఉద్యానవన శాస్త్రవేత్త డాక్టర్‌ ఎస్‌డి. శిఖామణిని రాష్ట్ర వ్యవసాయ కమిషన్‌ ప్రతిష్ఠాత్మక కృషిరత్న అవార్డుకు ఎంపిక చేసింది.

ఉద్యానవన శాస్త్రవేత్త శిఖామణికి కృషిరత్న అవార్డు

రాజేంద్రనగర్‌ , నవంబరు 20(ఆంధ్రజ్యోతి): ఉద్యానవన రంగంలో విశేష పరిశోధనలు, సాంకేతిక ఆవిష్కరణలు చేసిన ఉద్యానవన శాస్త్రవేత్త డాక్టర్‌ ఎస్‌డి. శిఖామణిని రాష్ట్ర వ్యవసాయ కమిషన్‌ ప్రతిష్ఠాత్మక కృషిరత్న అవార్డుకు ఎంపిక చేసింది.


నగరంలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆయనకు ఈ పురస్కారాన్ని అందజేశారు. కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌, రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, వ్యవసాయ కమిషన్‌ చైర్మన్‌ ఎం.కోదండరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


ఈ వార్తలనూ చదవండి:

భారత్‌కు పాక్ మంత్రి రాక.. మోదీ సర్కారుపై విపక్షాల విమర్శలు

తమిళనాడుకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ.. కావేరీ నీటి అభ్యర్థన తిరస్కరణ..

Updated Date - Nov 21 , 2026 | 07:03 AM