Share News

టీజీ-20 లీగ్‌ను హెచ్‌సీఏ అక్రమంగా నిర్వహిస్తోంది: టీసీఏ జనరల్ సెక్రటరీ గురువారెడ్డి..

ABN , Publish Date - Jun 20 , 2026 | 03:07 PM

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(HCA)పై తెలంగాణ క్రికెట్ అసోసియేషన్(TCA) జనరల్ సెక్రటరీ ధరమ్ గురువారెడ్డి మరోసారి సీఐడీకి ఫిర్యాదు చేశారు. టీజీ-20 లీగ్ కోసం హెచ్‌సీఏ ఏర్పాటు చేసిన బ్యాంక్ అకౌంట్లను వెంటనే నిలిపివేయాలని సీఐడీని ఆయన కోరారు.

టీజీ-20 లీగ్‌ను హెచ్‌సీఏ అక్రమంగా నిర్వహిస్తోంది: టీసీఏ జనరల్ సెక్రటరీ గురువారెడ్డి..
TCA General Secretary Guruva Reddy

హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(HCA)పై తెలంగాణ క్రికెట్ అసోసియేషన్(TCA) జనరల్ సెక్రటరీ ధరమ్ గురువారెడ్డి మరోసారి సీఐడీకి ఫిర్యాదు చేశారు. టీజీ-20 లీగ్ కోసం హెచ్‌సీఏ ఏర్పాటు చేసిన బ్యాంక్ అకౌంట్లను వెంటనే నిలిపివేయాలని సీఐడీని ఆయన కోరారు. ఫిర్యాదు అనంతరం గురువారెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హెచ్‌సీఏ నిర్వహిస్తున్న టీజీ-20 లీగ్‌కు అనుమతి లేదని, వెంటనే దాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. టీజీ-20 లీగ్‌ను హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అక్రమంగా నిర్వహిస్తోందన్నారు.


ఈ లీగ్‌కు హెచ్‌సీఏ జనరల్ బాడీ ఆమోదం లేదని, జనరల్ బాడీ ద్వారా ఎన్నుకోబడిన చైర్మన్ కూడా లేరని గురువారెడ్డి ఆరోపించారు. అలాగే ఈ లీగ్ కోసం హెచ్‌సీఏ తెరిచిన బ్యాంక్ ఖాతాను నిర్వహించడానికీ అనుమతులు లేవన్నారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ పబ్లిక్ అకౌంటబిలిటీ సంస్థ అని, కానీ బైలాస్, రూల్స్‌కు విరుద్ధంగా నిర్వాహకులు నడుచుకుంటున్నారని మండిపడ్డారు. టీజీ-20 లీగ్ ఆటగాళ్ల ఎంపికలోనూ బీసీసీఐ, ఐపీఎల్ నిబంధనలు పాటించలేదని గురువారెడ్డి విమర్శించారు. టీసీఏతో కలిసి లీగ్‌లను నిర్వహించాలని కోర్టు ఆదేశాలు ఉన్నా హెచ్‌సీఏ పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. కార్పొరేట్ కంపెనీలను ఇన్‌వాల్వ్ చేసి తెలంగాణ జిల్లాల పేరుతో హెచ్‌సీఏ లబ్ధి పొందాలని చూస్తోందని ఆయన ఆరోపించారు.


ఈ సందర్భంగా అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న బ్యాంక్ ఖాతాలను వెంటనే ఫ్రీజ్ చేయాలని గురువారెడ్డి డిమాండ్ చేశారు. రూ.46 కోట్ల నుంచి రూ.50 కోట్ల వరకు అంచనా మొత్తంతో బ్యాంక్ ఖాతా ఉందని, దాన్ని వెంటనే ఫ్రీజ్ చేయాలని సీఐడీని కోరినట్లు తెలిపారు. రూ.50 కోట్ల మేర అక్రమ లావాదేవీలు జరిగే అవకాశం ఉందని, అందుకే అకౌంట్‌ను నిలిపివేయాలని సీఐడీని కోరినట్లు పేర్కొన్నారు. మరోవైపు హెచ్‌సీఏలోని అపెక్స్, ప్రభుత్వ సభ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని సీఐడీకి విజ్ఞప్తి చేసినట్లు టీసీఏ జనరల్ సెక్రటరీ ధరమ్ గురువారెడ్డి తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి...

ప్రభుత్వ భూములు కబ్జా చేయాలని చూస్తే కఠిన చర్యలు.. సీఎం వార్నింగ్

వీకెండ్‌లో సిరిసిల్లకు వచ్చి వెళ్లిపోతారు.. కేటీఆర్‌పై కవిత సెటైర్లు

Updated Date - Jun 20 , 2026 | 04:10 PM