Share News

కాంగ్రెస్ కొత్తగా చేసిందేమీ లేదు.. అసెంబ్లీలో మైక్ కట్ చేయడంపై ఎమ్మెల్యే హరీశ్ రావు ఆగ్రహం

ABN , Publish Date - Mar 26 , 2026 | 01:04 PM

రాష్ట్రంలో ఆరోగ్య రంగానికి సంబంధించిన కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలపై బీఆర్ఎస్ నేతలు ఘాటుగా స్పందించారు. అసెంబ్లీ వేదికగా తమ గళాన్ని వినిపించేందుకు ప్రయత్నించినప్పటికీ, మైక్ ఇవ్వకపోవడంపై ఎమ్మెల్యే హరీశ్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ కొత్తగా చేసిందేమీ లేదు.. అసెంబ్లీలో మైక్ కట్ చేయడంపై ఎమ్మెల్యే హరీశ్ రావు ఆగ్రహం
Harish Rao Assembly Speech

హైదరాబాద్, మార్చి 26: రాష్ట్రంలో ఆరోగ్య రంగానికి సంబంధించిన కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలపై ఎమ్మెల్యే హరీశ్ రావు ఘాటుగా స్పందించారు. అసెంబ్లీ వేదికగా తమ గళాన్ని వినిపించేందుకు ప్రయత్నించినప్పటికీ, మైక్ ఇవ్వకపోవడంపై హరీశ్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మైకులు కట్‌చేసి తాము చెప్పాలనుకున్న వాస్తవాలను సభ దృష్టికి తీసుకురాకుండా ప్రభుత్వం అడ్డుపడుతోందన్నారు.


హరీశ్ రావు మాట్లాడుతూ.. ‘ఆరోగ్యశ్రీ ఖర్చుల పెంపుపై ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటోంది. 2014 జూన్ 2 నాటికి ఆరోగ్యశ్రీ కోసం నెలకు రూ.32 కోట్లు ఖర్చయ్యేవి. 2023 నాటికి ఇది రూ.68 కోట్లకు చేరుకుంది. కానీ.. ప్రభుత్వం రూ.89 కోట్లు ఖర్చు చేస్తున్నామని చెబుతోంది. జనాభా పెరుగుదల, వైద్య ఖర్చుల పెరుగుదల దృష్ట్యా ఈ పెంపు సహజం, ఇందులో కాంగ్రెస్ కొత్తగా సాధించిన ఘనతేమీ లేదు. కాంగ్రెస్ వచ్చిన తర్వాతే ఆరోగ్యశ్రీ ఖర్చులు బాగా పెరిగిపోయాయి. గత ప్రభుత్వ హయాంలో మంజూరు చేసి, పనులు చేపట్టిన ఆసుపత్రుల నిర్మాణానికి ప్రస్తుత ప్రభుత్వం జాప్యం చేస్తోంది. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి ఉంటే ఆ ఆస్పత్రులన్నీ పూర్తై ప్రజలకు మెరుగైన సేవలు అందేవి. ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా పేదలకు మరింత అండగా నిలవాలనే ఉద్దేశంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎక్సైజ్ అదాయంలో వాటాను పెంచి నిధులను సమకూర్చింది’ అని అన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

ఏపీలో ఇంటర్ సెకండియర్ సిలబస్ లీక్.. రంగంలోకి సైబర్ క్రైమ్ పోలీసులు

ఏప్రిల్‌ 1 నుంచి చికెన్‌ షాపులు బంద్‌!

Read Latest Telangana News and National News

Updated Date - Mar 26 , 2026 | 01:54 PM