Share News

విద్యుత్ వ్యవస్థ నిర్వహణలో ప్రభుత్వం విఫలం: హరీశ్‌రావు

ABN , Publish Date - Sep 22 , 2026 | 05:31 PM

బీఆర్ఎస్‌ హయాంలో రైతులకు 24 గంటల నాణ్యమైన విద్యుత్‌ అందించామని ఆ పార్టీ ముఖ్య నేత, ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతులకు 7 గంటలకు మించి విద్యుత్‌ సరఫరా చేయడం లేదని ఆయన ఆరోపించారు.

విద్యుత్ వ్యవస్థ నిర్వహణలో ప్రభుత్వం విఫలం: హరీశ్‌రావు
hareesh rao on power production in tg

హైదరాబాద్, సెప్టెంబర్ 22: బీఆర్ఎస్ హయాంలో రైతులకు 24గంటల నాణ్యమైన విద్యుత్‌ను ఇచ్చామని.. కాంగ్రెస్ ప్రభుత్వం 7 గంటల కన్నా ఎక్కువగా విద్యుత్‌ను సరఫరా చేయడంలేదని ఆ పార్టీ ముఖ్యనేత, ఎమ్మెల్యే హరీశ్ రావు మండిపడ్డారు. ఈ మేరకు రేవంత్ ప్రభుత్వాన్ని తీవ్రంగా దుయ్యబట్టారు.


4 వేల మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం కలిగిన యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్‌లో కేవలం 400 మెగావాట్లు ఉత్పత్తి చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్‌కు విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లను నిర్వహించడం రాదని.. అందుకే రాష్ట్రంలో తగినంత విద్యుత్ ఉత్పత్తి జరగడం లేదని హరీశ్ ధ్వజమెత్తారు. విద్యుత్ వ్యవస్థ నిర్వహణలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని హరీశ్ ఆరోపించారు. విద్యుత్ ఉత్పత్తికి అవకాశం ఉండి కూడా ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని ఆయన విమర్శించారు. ఎన్టీపీసీ 800 మెగావాట్ల ప్లాంట్ ఇస్తామంటే కూడా ప్రభుత్వం నిరాకరించిందన్నారు. కాంగ్రెస్ ఇచ్చే లో-వోల్టేజీ కరెంట్‌తో రైతుల మోటర్లు కాలిపోతున్నాయని హరీశ్ రావు ప్రభుత్వంపై ధ్వజమెత్తారు.

Updated Date - Sep 22 , 2026 | 08:04 PM