Share News

గోదావరి-కావేరి అనుసంధానానికి మార్గం సుగమం

ABN , Publish Date - Sep 18 , 2026 | 05:14 AM

గోదావరి–కావేరి అనుసంధానానికి ఏపీ, తెలంగాణ సూత్రప్రాయ అంగీకారం తెలిపాయి. సమ్మక్కసాగర్‌ బ్యారేజీ నుంచి నీటి తరలింపుతో తెలంగాణకు 42 టీఎంసీల జలాలు అందే అవకాశం ఉంది.

గోదావరి-కావేరి అనుసంధానానికి మార్గం సుగమం
Godavari Cauvery link project

  • తెలుగు రాష్ట్రాల సూత్రప్రాయ అంగీకారం

హైదరాబాద్‌, సెప్టెంబరు 17 (ఆంధ్రజ్యోతి): గోదావరి-కావేరి అనుసంధానానికి ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు సూత్రప్రాయంగా అంగీకారం తెలిపాయి. రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై ఈ నెల 7న జరిగిన సమావేశం మినిట్స్‌లో ఈ విషయాన్ని కేంద్ర జలవనరుల సంఘం (సీడబ్ల్యూసీ) పొందుపరిచి, ఉభయ రాష్ట్రాలకూ పంపింది. తెలుగు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదిరినందున ఇతర భాగస్వామ్య రాష్ట్రాలతో చర్చించి, ప్రాజెక్టుపై ముందుకెళ్లాలని పేర్కొంది. ప్రస్తుతం గోదావరిపై సమ్మక్కసాగర్‌ (తుపాకులగూడెం) బ్యారేజీ నిర్మాణం పూర్తయింది.


ఛత్తీస్‌గఢ్ దీనికి ఎన్‌వోసీ జారీ చేస్తే అనుమతులు కూడా వస్తాయి. సమ్మక్కసాగర్‌ నుంచే గోదావరి-కావేరి అనుసంధానం చేపడితే తెలంగాణకు ఈ పథకం తొలిదశలో 42 టీఎంసీల జలాలు లభించనున్నాయి. ఈ జలాల వినియోగం కోసం రెండు రిజర్వాయర్లు నిర్మించాలని తెలంగాణ కోరగా కేంద్రం అందుకు ప్రాథమికంగా అంగీకారం కూడా తెలిపింది. సమ్మక్కసాగర్‌ బ్యారేజీ 83 మీటర్ల ఎత్తుతో కట్టగా... 83 మీటర్ల నుంచి 85 మీటర్ల మధ్యలో నీటిని నిల్వ చేసి, ఆ నీటిని గోదావరి-కావేరీ అనుసంధానంలో తరలించాలని తెలంగాణ కోరుతోంది. అదే జరిగితే మరో రెండు మీటర్ల మేర బ్యారేజీ ఎత్తు పెంచాల్సి ఉంటుంది.


ఈ వార్తలనూ చదవండి:

1954లోనే మాకు వందల ఎకరాలు

టార్గెట్‌ ఫాంహౌస్‌!

Updated Date - Sep 18 , 2026 | 05:14 AM