Share News

హజ్‌ యాత్రకు మహిళలకు 500 సీట్లు!

ABN , Publish Date - Sep 18 , 2026 | 05:09 AM

హజ్‌-2027 యాత్రకు మహిళలు దరఖాస్తు చేసుకునేందుకు హజ్‌ కమిటీ ఆఫ్‌ ఇండియా ఏర్పాట్లు పూర్తిచేసిందని మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఫరూక్‌ తెలిపారు.

హజ్‌ యాత్రకు మహిళలకు 500 సీట్లు!

  • 23 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ: మంత్రి ఫరూక్‌

అమరావతి, సెప్టెంబరు 17(ఆంధ్రజ్యోతి): హజ్‌-2027 యాత్రకు మహిళలు దరఖాస్తు చేసుకునేందుకు హజ్‌ కమిటీ ఆఫ్‌ ఇండియా ఏర్పాట్లు పూర్తిచేసిందని మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఫరూక్‌ తెలిపారు. మెహ్రం కేటగిరీ కింద మహిళలకు 500 సీట్లు కేటాయించేందుకు అవకాశం కల్పించినట్లు గురువారం వెల్లడించారు. మెహ్రం తోడుగా హజ్‌ యాత్రకు వెళ్లాలనుకున్నప్పటికీ, పాస్‌పోర్ట్‌, ఇతర కారణాల వల్ల గతంలో దరఖాస్తు చేసుకోలేకపోయిన అర్హత కలిగిన మహిళలకు ఈ ప్రత్యేక కేటగిరీ ద్వారా అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 23 నుంచి అక్టోబరు 7 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నట్టు పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న వారు www.hazcommittee.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. హజ్‌-2027 యాత్ర నిబంధనలు, అర్హతలను పూర్తిగా పరిశీలించి, అవసరమైన పత్రాలతో దరఖాస్తు చేసుకోవాలన్నారు.


ఈ వార్తలనూ చదవండి:

భలే మంచి బేరం !

బీజేపీది ద్వంద్వ వైఖరి: బొత్స

Updated Date - Sep 18 , 2026 | 05:09 AM