ఘనంగా ‘ఆశీర్వాద దీపం’
ABN , Publish Date - Sep 18 , 2026 | 12:25 AM
ప్రధాని మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని బీజేపీ జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు వై.స్మిత, పార్టీ జిల్లా అధ్యక్షుడు రాజేష్‌వర్మల ఆధ్వర్యంలో కోట జంక్షన్ వద్ద ఆశీర్వాద దీపం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
ప్రధాని మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన కూటమి నాయకులు
విజయనగరం దాసన్నపేట, సెప్టెంబరు 17(ఆంధ్ర జ్యోతి): ప్రధాని మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని బీజేపీ జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు వై.స్మిత, పార్టీ జిల్లా అధ్యక్షుడు రాజేష్‌వర్మల ఆధ్వర్యంలో కోట జంక్షన్ వద్ద ఆశీర్వాద దీపం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే అదితి గజపతిరాజు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాజేష్‌వర్మ, తూర్పు కాపు కార్పొరేషన్ చైర్‌పర్సన్ పాలవలస యశ స్వి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు కిమిడి నాగార్జున, కూటమి నాయకులు పాల్గొన్నారు.
లక్కవరపుకోట, సెప్టెంబరు 17(ఆంధ్రజ్యోతి): ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జీవితం దేశానికే ఆదర్శనమని ఎమ్మెల్యే లలితకుమారి అన్నారు. గురువారం రాత్రి ఆమె ఎల్.కోటలోని తన స్వగృహంలో కుటుంబ సభ్యులు, మహిళలతో కలిసి ఆశీర్వాద దీపం కార్యక్రమం నిర్వహించారు.
భోగాపురం, సెప్టెంబరు 17(ఆంధ్రజ్యోతి): ప్రధాని నరేంద్ర మోదీతోనే దేశాభివృద్ధి దూసుకుపో తుందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఉప్పలపాటి రాజేష్ వర్మ అన్నారు. భోగాపురం గ్రామంలో గురువారం బీజేపీ నాయకులు ఎస్‌ఏఎన్ రాజు, ఏవీఎస్ ప్రసాదు ఆధ్వర్యంలో మోదీ జన్మదిన వేడుకలు నిర్వహించా రు. అలాగే పారిశుధ్య కార్మికులను సన్మానించారు. అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.