Share News

జర్మనీలో ఫిజియోథెరపిస్టు ఉద్యోగాలు

ABN , Publish Date - Oct 02 , 2026 | 06:40 AM

జర్మనీలో ఫిజియోథెరపిస్టులుగా పనిచేయాలనుకునే తెలంగాణ యువతకు తెలంగాణ ఓవర్సీస్‌ మ్యాన్‌ పవర్‌ కంపెనీ లిమిటెడ్‌ (టామ్‌కామ్‌) ఉద్యోగ అవకాశాలను కల్పిస్తోంది.

జర్మనీలో ఫిజియోథెరపిస్టు ఉద్యోగాలు
Germany physiotherapist jobs

హైదరాబాద్‌, అక్టోబరు 1 (ఆంధ్రజ్యోతి): జర్మనీలో ఫిజియోథెరపిస్టులుగా పనిచేయాలనుకునే తెలంగాణ యువతకు తెలంగాణ ఓవర్సీస్‌ మ్యాన్‌ పవర్‌ కంపెనీ లిమిటెడ్‌ (టామ్‌కామ్‌) ఉద్యోగ అవకాశాలను కల్పిస్తోంది. టామ్‌కామ్‌ ఎండీ ఏఎన్‌ కాంతి వెస్లీ ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. ఫిజియోథెరపిస్టు పోస్టులకు బీ.పీటీ లేదా ఎం.పీటీ విద్యార్హత కలిగి ఉండాలి. సంబంధిత రంగంలో క్లినికల్‌ అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యం ఉంటుంది. అభ్యర్థుల వయసు 43 ఏళ్లకు మించకూడదు. ఎంపికైన వారికి సౌకర్యాలతో కూడిన ఉద్యోగంతోపాటు ఆకర్షణీయమైన వేతనాన్ని అందించనున్నారు.


టామ్‌కామ్‌ ద్వారా ఉద్యోగం పొందే అభ్యర్థులకు జర్మనీ ఫిజియోథెరపీ కౌన్సిల్‌, డాక్యుమెంటేషన్‌ ప్రాసెసింగ్‌, అసెస్‌మెంట్‌ ప్రాసెసింగ్‌, వీసా ప్రాసెసింగ్‌, జర్మనీకి విమాన టికెట్‌ తదితర సేవలు అందించనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. టామ్‌కామ్‌ ఫోన్‌ 08035524946 ఫోన్‌ చేయడం ద్వారా, దరఖాస్తుల్ని ఈ-మెయిల్‌ tomcomglobal@gmail.comకు పంపించం ద్వారా మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చని టామ్‌కామ్‌ కాంతి వెస్లీ తెలిపారు.


ఇవి కూడా చదవండి...
నో మైనింగ్‌ జోన్‌గా ఫ్యూచర్‌ సిటీ!

విద్యుత్‌ కొరతతో పంటలు ఎండుతున్నాయి

Read Latest Telangana News And Telugu News

Updated Date - Oct 02 , 2026 | 06:57 AM