Share News

ఫాల్కన్ ఇన్వాయిస్ స్కామ్‌ కేసులో కీలక నిందితుడి అరెస్టు..

ABN , Publish Date - Jun 19 , 2026 | 09:00 PM

ఫాల్కన్ ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ స్కామ్ కేసులో మరో కీలక నిందితుడిని తెలంగాణ సీఐడీ అధికారులు అరెస్టు చేశారు. ముంబైకి చెందిన వరల్డ్‌లైన్ ఈ-పేమెంట్ గేట్‌వే ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ షేక్ మొహిదీన్‌ను అదుపులోకి తీసుకున్నారు.

ఫాల్కన్ ఇన్వాయిస్ స్కామ్‌ కేసులో కీలక నిందితుడి అరెస్టు..
Falcon Invoice Discounting Scam

హైదరాబాద్: ఫాల్కన్ ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ స్కామ్ కేసులో మరో కీలక నిందితుడిని తెలంగాణ సీఐడీ అధికారులు అరెస్టు చేశారు. ముంబైకి చెందిన వరల్డ్‌లైన్ ఈ-పేమెంట్ గేట్‌వే ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ షేక్ మొహిదీన్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఫాల్కన్ ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ పేరుతో రూ.792 కోట్ల మోసానికి పాల్పడిన కేసులో అతడిని అరెస్టు చేశారు. ఈ కేసులో ఇప్పటికే ఫాల్కన్ గ్రూప్ ఎండీ అమర్‌దీప్ కుమార్‌తో పాటు పలువురు కీలక నిందితులు అరెస్టయ్యారు. తాజాగా ముంబైకి చెందిన ఈ కీలక నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.


నిందితులు ఫాల్కన్ ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ అప్లికేషన్, వెబ్‌సైట్ ద్వారా దేశవ్యాప్తంగా 7,056 మంది నుంచి పెట్టుబడుల రూపంలో నగదు సేకరించినట్లు సీఐడీ అధికారులు గుర్తించారు. అధిక లాభాల ఆశ చూపి డిపాజిటర్ల నుంచి ఏకంగా రూ.4,215 కోట్లు తీసుకున్నట్లు తేల్చారు. వీరిలో 4,065 మందిని M/s క్యాపిటల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా రూ.792 కోట్ల మేర మోసం చేసినట్లు తెలిపారు.


కాగా, అమర్‌దీప్ కుమార్‌తో షేక్ మొహిదీన్ కుమ్మక్కై పేమెంట్ గేట్‌వే సేవల ద్వారా డిపాజిట్లు సేకరించేందుకు సహకరించినట్లు సీఐడీ అధికారులు తేల్చారు. దీంతో ఈ కంపెనీతో సుమారు రూ.7.5 కోట్ల లావాదేవీలు జరిగినట్లు సీఐడీ అధికారులు గుర్తించారు. ఈ మేరకు నిందితుడు షేక్ మొహిదీన్‌ను అరెస్టు చేసిన సీఐడీ అధికారులు రిమాండ్‌కు తరలించారు.


ఈ వార్తలు కూడా చదవండి

జనసేన తెలంగాణ రాష్ట్ర కార్యాలయ ప్రారంభోత్సవం.. పార్టీ జెండా ఆవిష్కరించిన పవన్

హైదరాబాద్ వాసులకు ట్రాఫిక్ అలర్ట్.. కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వే ట్రయల్ రన్

Updated Date - Jun 19 , 2026 | 09:37 PM