బొల్లా బ్రహ్మనాయుడు కస్టడీ పూర్తి.. ‘తెలియదు, గుర్తులేదు’ అంటూ సమాధానం
ABN , Publish Date - Jun 18 , 2026 | 04:15 PM
ఫేక్ జీవో కేసులో వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు కస్టడీ పూర్తయ్యింది. బ్రహ్మనాయుడిని సైబరాబాద్ ఈవోడబ్ల్యూ అధికారులు మూడు రోజులపాటు కస్టడీకి తీసుకొని విచారించారు.
హైదరాబాద్, జూన్ 18: ఫేక్ జీవో కేసులో వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు కస్టడీ పూర్తయ్యింది. బ్రహ్మనాయుడిని సైబరాబాద్ ఈవోడబ్ల్యూ అధికారులు మూడు రోజులపాటు కస్టడీకి తీసుకొని విచారించారు. అయితే కస్టడీలో పోలీసులకు మాజీ ఎమ్మెల్యే ఏమాత్రం సహకరించనట్లు తెలుస్తోంది. ఏ ప్రశ్న అడిగినా ‘తెలియదు, గుర్తులేదు’ అనే సమాధానాలు చెప్పినట్లు సమాచారం. రూ.1000 కోట్ల భూమిని అక్రమంగా కొట్టేయాలని బ్రహ్మనాయుడు ప్లాన్ చేసినట్టు ఈవోడబ్ల్యూ అధికారుల విచారణలో వెల్లడైంది.
భూమిని కొట్టేసేందుకు బ్రహ్మనాయుడు రూ.8 కోట్లు సమకూర్చినట్లు అధికారులు గుర్తించారు. దీనిపైనే ప్రశ్నలు వేయగా.. మాజీ ఎమ్మెల్యే సమాధానాలు దాటవేసినట్లు తెలుస్తోంది. మరికొన్ని ప్రశ్నలకు మౌనంగా ఉంటూ తనకేం తెలియదని బుకాయించే ప్రయత్నం చేసినట్లు సమాచారం. ఇప్పటికే ఐదుగురు నిందితులు కస్టడీలో వెల్లడించిన వివరాలను ఆధారంగా చేసుకొని బ్రహ్మనాయుడిని అధికారులు ప్రశ్నించారు. ‘వారు చెప్పిన సమాధానాలకు నాకు ఎలాంటి సంబంధం లేదు’ అని పోలీసుల ముందు బ్రహ్మానాయుడు బుకాయించే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. మూడురోజుల కస్టడీ ముగియడంతో బొల్లా బ్రహ్మనాయుడిని రంగారెడ్డి జిల్లా కోర్టుకు పోలీసులు తరలించారు.
ఇవి కూడా చదవండి...
ఆనాడు నా మదిలో పుట్టిన ఆలోచనకు ఆచరణే నేటి వనమహోత్సవం: సీఎం రేవంత్ రెడ్డి
జులై 1 నుంచి 11 శాతం ఫిట్‌మెంట్.. ఆర్టీసీ ఉద్యోగులకు పొన్నం ప్రభాకర్ శుభవార్త
Read Latest Telangana News And Telugu News