నకిలీ బ్యాంక్ గ్యారంటీతో ACC సిమెంట్‌కు రూ.2 కోట్ల మోసం..
ABN , Publish Date - Jan 30 , 2026 | 09:03 PM
హైదరాబాద్‌లో అదానీ గ్రూప్‌నకు చెందిన ACC సిమెంట్ కంపెనీని నకిలీ బ్యాంక్ గ్యారంటీతో మోసం చేసిన భారీ స్కామ్ వెలుగులోకి వచ్చింది. పీఎన్‌బీ బ్యాంక్ గ్యారంటీగా నకిలీ డాక్యుమెంట్లు చూపించి రూ.2 కోట్లకు పైగా విలువైన సిమెంట్ సరఫరా పొందినట్లు ఆరోపణలు ఉన్నాయి..
హైదరాబాద్: అదానీ గ్రూప్‌నకు చెందిన ACC సిమెంట్ కంపెనీని సుమారు రూ.2 కోట్ల మేర మోసం చేసిన ఘటన హైదరాబాద్‌లో వెలుగులోకి వచ్చింది. లక్కీ భాస్కర్ సినిమా తరహాలో నకిలీ బ్యాంక్ గ్యారంటీ చూపించి భారీగా సిమెంట్ సరఫరా పొందినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో జేపీ ఇన్‌ఫ్రా అండ్ ఇంజినీరింగ్ సంస్థ యజమాని జయ ప్రకాష్ ఇన్నార్తి, అతని సహచరుడు మమ్మోహన్‌పై పంజాగుట్ట పోలీసులు చీటింగ్, ఫోర్జరీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.
పీఎన్‌బీ బ్యాంక్ గ్యారంటీగా చూపిన డాక్యుమెంట్ నకిలీదని ACC సిమెంట్ కంపెనీ గుర్తించింది. నిందితులు నకిలీ బ్యాంక్ గ్యారంటీ ఆధారంగా రూ.2 కోట్లకు పైగా విలువైన సిమెంట్ సరఫరా పొందారని ఆరోపణలు ఉన్నాయి. అయితే, సరఫరా చేసిన సిమెంట్‌కు సంబంధించి ఎన్ క్యాష్ రూపంలో కేవలం రూ.5.6 లక్షలు మాత్రమే చెల్లించినట్లు ACC సంస్థ ఫిర్యాదులో పేర్కొంది. ఈ ఘటనపై పోలీసులు విచారణ ప్రారంభించారు. నిందితుల ఆచూకీ కోసం ప్రత్యేక చర్యలు చేపట్టారు. నకిలీ డాక్యుమెంట్లతో వ్యాపార సంస్థలను మోసం చేసే ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ కేసు సంచలనం రేపుతోంది.
ఇవి కూడా చదవండి:
డబ్ల్యూపీఎల్ 2026.. టాస్ ఓడిన ముంబై ఇండియన్స్
దాన్ని అద్భుతమైన ప్రదర్శన అనలేం.. పాక్ పీఎం ట్వీట్‌పై ఆకాశ్ చోప్రా రియాక్షన్