Share News

సౌమ్య మృతి.. నిందితులపై కఠిన చర్యలకు సీఎం ఆదేశాలు

ABN , Publish Date - Feb 01 , 2026 | 11:00 AM

ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య మృతిప‌ట్ల సీఎం రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సౌమ్య కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

సౌమ్య మృతి.. నిందితులపై కఠిన చర్యలకు సీఎం ఆదేశాలు
CM Revanth Reddy

హైదరాబాద్, ఫిబ్రవరి 1: ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య మృతి ప‌ట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సంతాపం వ్యక్తం చేశారు. విధి నిర్వహ‌ణ‌లో సౌమ్య ప్రాణాలు కోల్పోవడంపై సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. సౌమ్య మృతికి కార‌ణ‌మైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారుల‌ను ఆదేశించారు. సౌమ్య కుటుంబానికి ప్రభుత్వం (Telangana Govt) అన్ని విధాలుగా అండ‌గా ఉంటుంద‌ని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.


సౌమ్య మృతి బాధాకరం: సుదర్శన్ రెడ్డి

ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య మృతి పట్ల ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి సంతాపం ప్రకటించారు. సౌమ్య మృతి చెందడం బాధాకరమన్నారు. గంజాయి స్మగ్లర్ల దాడిలో తీవ్రంగా గాయపడిన సౌమ్యను కాపాడుకునేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేసిందని తెలిపారు. మత్తు పదార్థాల రవాణా, వినియోగంపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోందన్నారు. సౌమ్య కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి స్పష్టం చేశారు.


తొమ్మిది రోజులు మృత్యువుతో పోరాడి

నిజామాబాద్‌లో గంజాయి స్మగ్లర్లను పట్టుకునే ప్రయత్నంలో గాయపడిన ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య మృతి చెందారు. దాదాపు తొమ్మిది రోజుల పాటు మృత్యువుతో పోరాడిన సౌమ్య.. శనివారం రాత్రి మరణించారు. జనవరి 23న రాత్రి మాధవనగర్ వద్ద సౌమ్యను గంజాయి ముఠా కారుతో ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడ్డ సౌమ్యను చికిత్స నిమిత్తం హైదరాబాద్‌‌లోని నిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడటంతో ఒక కిడ్నీ, ప్లీహం తొలగించారు నిమ్స్ వైద్యులు. అయితే చికిత్స పొందతూ పరిస్థితి విషమించడంతో సౌమ్య మృతి చెందారు. సౌమ్య మృతితో ఆమె స్వగ్రామం మోస్రలో విషాద ఛాయలు అలముకున్నాయి. సాయంత్రానికి సౌమ్య మృతదేహం స్వగ్రామానికి చేరనుంది. సౌమ్య తల్లిదండ్రులు గాజుల సాయిలు, చంద్రకళలు వారాంతపు సంతలో వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. 2024 బ్యాచ్‌కు చెందిన సౌమ్యకు మొదటి పోస్టింగ్ నిజామాబాద్‌లోనే.


ఇవి కూడా చదవండి...

కోనసీమ జిల్లాలో మరోసారి గ్యాస్ లీక్.. ఓఎన్జీసీ నిర్లక్ష్యంపై స్థానికుల ఆవేదన

కేసీఆర్ సిట్ విచారణ.. పోలీసులకు ఇంటెలిజెన్స్ చీఫ్ అలర్ట్ మెసేజ్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Feb 01 , 2026 | 11:31 AM