డీలిమిటేషన్‌తో ‘దక్షిణాది’కి తీవ్ర అన్యాయం
ABN , Publish Date - Nov 30 , 2026 | 04:16 AM
నియోజకవర్గాల పునర్విభజన(డీలిమిటేషన్)తో దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివ రావు అన్నారు.
రాజకీయ లబ్ధి కోసమే బీజేపీ కుట్రలు : కూనంనేని
పాల్వంచ టౌన్, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): నియోజకవర్గాల పునర్విభజన(డీలిమిటేషన్)తో దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివ రావు అన్నారు. జనాభా నియంత్రణ, విద్య, వైద్య రంగాల్లో ముందున్న దక్షిణాది రాష్ట్రాలు డీలిమిటేషన్‌తో పార్లమెంట్‌లో ప్రాతినిధ్యం కోల్పోయే ప్రమాదం ముంచుకొస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఆదివారం పాల్వంచలో జరిగిన భద్రాద్రి జిల్లా సీపీఐ కౌన్సిల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జనాభా లెక్కలు తేల్చిన తర్వాతే నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలన్నారు. ప్రతిపక్షాలను ఎదుర్కొనే సత్తాలేని బీజేపీ, వాటిని చీల్చి రాజకీయ లబ్ధి పొందేందుకు కుట్రలు చేస్తోందని ఆరోపించారు. మోదీ ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తోందని ఆయన అన్నారు.
ఈ వార్తలనూ చదవండి:
డీలిమిటేషన్‌తో ఏ రాష్ట్రానికి ఎన్ని సీట్లు పెరుగుతాయో తెలుసా?
అఫ్గానిస్థాన్‌లో భారీ పేలుడు.. ఆరుగురు విద్యార్థుల మృతి, 97 మందికి గాయాలు..!