రైళ్ల రాకపోకలపై ఆక్వాన్ తుఫాన్ ప్రభావం
ABN , Publish Date - Nov 21 , 2026 | 05:34 AM
ఆక్వాన్ తుఫాన్ ప్రభావంతో దక్షిణ మధ్య రైల్వే పరిధిలో రైళ్ల రాకపోకలపై తీవ్ర గందరగోళం ఏర్పడింది.
హైదరాబాద్ సిటీ, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): ఆక్వాన్ తుఫాన్ ప్రభావంతో దక్షిణ మధ్య రైల్వే పరిధిలో రైళ్ల రాకపోకలపై తీవ్ర గందరగోళం ఏర్పడింది. గురువారం హైదరాబాద్ నుంచి భువనేశ్వర్, హౌరా వైపు బయల్దేరి వెళ్లిన పలు రైళ్లు శుక్రవారం అర్ధరాత్రి వరకు గమ్యానికి చేరుకోలేకపోయాయి. ప్రధానంగా సికింద్రాబాద్ నుంచి హౌరాకు బయల్దేరిన ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్, భువనేశ్వర్‌కు వెళ్లాల్సిన విశాఖ ఎక్స్‌ప్రెస్, ఈస్ట్‌కోస్ట్ ఎక్స్‌ప్రెస్‌లు గంటల కొద్దీ ఆలస్యంగా నడిచాయి. మిర్యాలగూడ, సత్తెనపల్లి, మధిర తదితర చిన్న స్టేషన్లలో గంటల కొద్దీ ఎక్స్‌ప్రెస్ రైళ్లను నిలిపివేయడంతో ప్రయాణికులు తీవ్ర అసహనానికి గురయ్యారు.
విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో గురువారం రాత్రి 10 గంటలకు గుంటూరు చేరుకోవాల్సిన ప్రయాణికులు అర్ధరాత్రి ఒంటిగంటకు చేరుకోగా... శుక్రవారం సాయంత్రం 4గంటలకు భువనేశ్వర్ వెళ్లాల్సిన వారు రాత్రి 10 గంటలైనా గమ్యానికి చేరుకోలేదు. ఈస్ట్‌కోస్ట్, ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌ల్లోనూ ఇవే ఇబ్బందులు ఎదురయ్యాయి. తుఫాన్ ఒంగోలు తీరం దాటుతుందన్న సమాచారంతో అధికారులు హైదరాబాద్ నుంచి తిరుపతి, చెన్నై, త్రివేండ్రం వైపు వెళ్లాల్సిన రైళ్లను నియంత్రించేందుకు చర్యలు చేపట్టారు. కాసేపటికి తుఫాన్ దిశ మారి కాకినాడ వద్ద తీరం దాటుతుందన్న సమాచారంతో విశాఖవైపు వెళ్లే రైళ్లను నిలిపివేశారు. అయితే, తుఫాన్ చ్చాపురం-ఒడిశా వద్ద తీరం దాటి భారీవర్షాలు కురుస్తుండడంతో విజయనగరం నుంచి భువనేశ్వర్, హౌరా వైపు రైళ్లను దారి మళ్లించారు. కాగా శుక్రవారం నుంచి రైళ్లు యథావిధిగా నడుస్తున్నాయన్నారు.
ఈ వార్తలనూ చదవండి:
వీసా, మాస్టర్ కార్డ్, జేపీ మోర్గాన్‌పై సైబర్ దాడి.. కస్టమర్ల సమాచారం లీక్!
ఆపరేషన్ మిడ్‌నైట్ హ్యామర్.. 37 గంటల మిషన్‌లో ఏం జరిగిందంటే..