శాంతిభద్రతల రక్షణలో సైబరాబాద్ కమిషనరేట్ కీలక పాత్ర: సీపీ రమేశ్
ABN , Publish Date - Feb 12 , 2026 | 10:51 AM
సైబరాబాద్ కమిషనరేట్ 24వ ఏడాదిలోకి ప్రవేశించడం సంతోషంగా ఉందని సీపీ రమేశ్ తెలిపారు. రోజురోజుకూ సైబర్ నేరాల సంఖ్య పెరుగుతున్నాయని ఆయన అన్నారు.
హైదరాబాద్, ఫిబ్రవరి 12: సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ 24వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనరేట్‌లో సీపీ రమేశ్ (CP Ramesh) జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం సీపీ మాట్లాడుతూ... కమిషనరేట్ 24వ ఏడాదిలోకి అడుగుపెట్టిన సందర్భంగా సంతోషం వ్యక్తం చేశారు సీపీ. రోజురోజుకూ సైబర్ నేరాల సంఖ్య పెరుగుతున్నాయని పేర్కొన్నారు. సైబర్ క్రైమ్స్ ప్రస్తుతం పెద్ద సవాలుగా మారాయని, అంతేకాకుండా ఇంటర్నేషనల్ డ్రగ్స్ ముఠాలు సమాజ అభివృద్ధికి అడ్డంకిగా ఉన్నాయని అన్నారు.
డ్రగ్స్, సైబర్ క్రైమ్ నేరాల నియంత్రణకు మరింత కృషి చేయాల్సిన అవసరం ఉందని సీపీ వెల్లడించారు. దేశీయ, అంతర్జాతీయ స్థాయిలో సైబరాబాద్ కమిషనరేట్‌కు మంచి పేరు ఉందని ఆయన అన్నారు. ప్రతీ ఏడాది రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరుగుతోందని... యుద్ధంలో చనిపోయే వారి కంటే రోడ్డు ప్రమాదాల్లో మరణించే వారి సంఖ్య ఎక్కువగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. నగరంలో శాంతిభద్రతలు కాపాడటంలో సైబరాబాద్ కమిషనరేట్ కీలక పాత్ర పోషిస్తోందని తెలిపారు. లక్షల మంది వలసదారులు ఇక్కడ జీవనం సాగిస్తున్న నేపథ్యంలో వారందరికీ నిరంతర రక్షణ కల్పించాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని సీపీ చెప్పారు.
ఐటీ, ఫార్మా, రియల్ ఎస్టేట్ వంటి ప్రముఖ సంస్థలు ఎక్కువగా సైబరాబాద్ పరిధిలో ఉన్నాయని తెలిపారు. వీటి భద్రతను కాపాడే విధంగా పోలీసులు వ్యవహరించాలని ఆదేశించారు. తనకు ముందు ఇక్కడ 9 మంది సీపీలుగా పనిచేశారని, త్వరలో వారందరినీ కలిసి కమిషనరేట్ అభివృద్ధికి సూచనలు తీసుకుంటామని సీపీ రమేశ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా రక్తదాన శిబిరం, పర్యావరణ కార్యక్రమాలు, వివిధ సేవా కార్యక్రమాలను సీపీ రమేశ్ ప్రారంభించారు.
ఇవి కూడా చదవండి...
హైదరాబాద్ కేపీహెచ్‌బీ పరిధిలో అగ్నిప్రమాదం
ఏపీ అసెంబ్లీ సమావేశాలు... కొనసాగుతున్న ప్రశ్నోత్తరాలు
Read Latest Telangana News And Telugu News