Share News

చిన్నారుల కోసం 'తొలి ముద్ద' పథకాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్

ABN , Publish Date - Mar 28 , 2026 | 04:36 PM

అంగన్వాడీ చిన్నారులకు అల్పాహారం అందించేందుకు 'తొలి ముద్ద' పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. దీని ద్వారా ప్రభుత్వం ఉప్మా, కిచిడీ మిక్స్‌ను బ్రేక్‌ ఫాస్ట్‌గా అందించనుంది.

చిన్నారుల కోసం 'తొలి ముద్ద' పథకాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్

స్పోర్ట్స్ డెస్క్: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు. ఆరు గ్యారంటీల పేరుతో సుపరిపాలన అందిస్తున్నారు. ప్రజల సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి రెండింటిని జోడెడ్లలా పరుగులు పెట్టిస్తున్నారు. చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు అందరికీ ఏదో ఒక పథకాన్ని అమలు చేస్తున్నారు. తాజాగా.. అంగన్వాడీ చిన్నారులకు అల్పాహారం అందించేందుకు 'తొలి ముద్ద' పథకాన్ని సీఎం రేవంత్ ప్రారంభించారు. ఈ పథకం ద్వారా ఉప్మా, కిచిడీ మిక్స్‌ను చిన్నారులకు బ్రేక్‌ఫాస్ట్‌గా అందించనుంది ప్రభుత్వం.


ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ..'గతంలో దేశంలో నిరక్షరాస్యతను తగ్గించేందుకు, వ్యవసాయ అభివృద్ధికి తొలి ప్రధాని నెహ్రూ ఎడ్యుకేషన్, ఇరిగేషన్‌కు ప్రాధాన్యమిచ్చారు. దేశంలో ప్రస్తుతం ఆహార భద్రత ఉంది.. కానీ పౌష్టికాహారం అందడం లేదు. అందుకే ప్రభుత్వం బిడ్డ కడుపులో ఉన్నప్పటి నుంచే తల్లికి పౌష్టికాహారం అందిస్తోంది. అందుకే తాజాగా.. బ్రేక్ ఫాస్ట్ స్కీంను కూడా ప్రారంభించాం. ప్రభుత్వం ఎంత మంచి ప్రణాళికలు చేసినా.. అమలు చేయాల్సింది అంగన్వాడీ టీచర్లు మాత్రమే. అందుకే ఈ ప్రభుత్వం మీపై గురుతర బాధ్యత పెట్టింది' అని అన్నారు.


ఈ కార్యక్రంలో అంగన్వాడీ సిబ్బందికి మొబైల్ ఫోన్లు పంపిణీ చేశారు ముఖ్యమంత్రి. అంగన్వాడీ కేంద్రాలు అద్దె భవనాల్లో ఉండటానికి వీల్లేదని, సొంత భవనాలు నిర్మించేందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు సీఎం ఆదేశించారు. అంగన్వాడీ సిబ్బందిని ప్రభుత్వం కుటుంబ సభ్యుల్లా భావిస్తోందని వారి సమస్యలపై ఎప్పటికప్పుడు చర్చిస్తున్నామన్నారు. ఏ మాత్రం ఆర్థిక వెసులుబాటు కలిగినా ముందుగా వారి సమస్యలనే పరిష్కరిస్తామని అంగన్వాడీలకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రులు సీతక్క, కొండా సురేఖ, ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఫహీమ్, చైల్డ్ వెల్ఫేర్ కమిషన్ చైర్మన్ సీతా దయాకర్‌రెడ్డి సహా పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

అలాగే ఎల్బీ స్టేడియంలో లెజిస్లేటర్స్ స్పోర్ట్స్ అండ్ కల్చరల్ మీట్‌ను సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ ఆటల పోటీలు నేడు, రేపు కొనసాగనున్నాయి. ఆదివారం రవీంద్ర భారతిలో కల్చలర్ పోటీలు జరగనున్నాయి. ఈ పోటీల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొననున్నారు.


ఇవి కూడా చదవండి:

ముఖ్యమంత్రిపై అభ్యంతరకర వ్యాఖ్యలు.. చిక్కుల్లో పాక్ క్రికెటర్

గంభీర్ పేరుతో ఉన్న ఏఐ వీడియోలు 36 గంటల్లో తొలగించాలి: ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు

Updated Date - Mar 28 , 2026 | 05:38 PM