Share News

రూ.1,511కోట్ల అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ శంకుస్థాపన

ABN , Publish Date - Jun 07 , 2026 | 06:58 PM

హైదరాబాద్ ఉప్పల్ భగాయత్ లేఅవుట్‌లో రూ.1,511 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపనలు చేశారు. 10 ఎకరాల్లో రూ.98కోట్లతో నిర్మించే మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్ భవన నిర్మాణానికి రేవంత్ శంకుస్థాపన చేశారు. అలాగే మరికొన్ని పనులకు భూమిపూజ చేశారు.

రూ.1,511కోట్ల అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ శంకుస్థాపన

హైదరాబాద్: ఉప్పల్ భగాయత్ లేఅవుట్‌లో రూ.1,511 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపనలు చేశారు. 10 ఎకరాల్లో రూ.98కోట్లతో నిర్మించే మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్ భవన నిర్మాణానికి రేవంత్ శంకుస్థాపన చేశారు. రూ.960 కోట్లతో ఏవోసీ సెంటర్‌లో ప్రత్యామ్నాయ రోడ్ల నిర్మాణానికీ కొబ్బరికాయ కొట్టారు. అలాగే రూ.416కోట్లతో టీకేఆర్ కాలేజ్ జంక్షన్‌లో 6 లేన్ల ఫ్లై ఓవర్ నిర్మాణానికి ముఖ్యమంత్రి భూమిపూజ చేశారు.


రూ.37.50కోట్లతో 100పడకల మల్కాజ్‌గిరి జిల్లా ఆస్పత్రి నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. మరోవైపు క్యూర్ వన్ యాప్‌ను ప్రారంభించారు. కాగా, ఈ కార్యక్రమానికి మంత్రులు దుద్దిళ్ల శ్రీధ‌ర్ బాబు, దామోదర రాజనర్సింహ, ప్రభుత్వ సలహాదారు వి.హనుమంత రావు, రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్ హాజరయ్యారు. అలాగే భువనగిరి ఎంపీ చామ‌ల ‌కిర‌ణ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్, ఎమ్మెల్యేలు బండారి లక్ష్మారెడ్డి, మల్‌రెడ్డి రంగారెడ్డి, శ్రీ గణేశ్ పాల్గొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

హిట్లర్‌ను చూసి హైడ్రా పెట్టానంటావా.. సీఎం రేవంత్‌‌పై హరీశ్‌రావు ధ్వజం

మెదక్‌లో ఆర్మీ ఉద్యోగి దారుణ హత్య.. అసలు విషయమిదే..

Updated Date - Jun 07 , 2026 | 07:04 PM