Share News

ప్లాస్టిక్‌ క్లిప్‌లు, హెయిర్‌ బ్యాండ్ల ముసుగులో.. భారత్‌కు చైనా బాణసంచా

ABN , Publish Date - Oct 07 , 2026 | 06:33 AM

చైనా నుంచి అక్రమంగా ప్లాస్టిక్‌ క్లిప్‌లు, హెయిర్‌ బ్యాండ్లు, స్టోరేజ్‌ వార్డ్‌రోబ్‌లు, షూ ర్యాక్‌ల ముసుగులో భారత్‌కు బాణసంచాను దిగుమతి చేస్తున్న ముఠా కార్యకలాపాలను డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌(డీఆర్‌ఐ) అధికారులు గుర్తించారు.

ప్లాస్టిక్‌ క్లిప్‌లు, హెయిర్‌ బ్యాండ్ల ముసుగులో.. భారత్‌కు చైనా బాణసంచా
China fireworks illegal import

  • చెన్నైలో రూ.12 కోట్ల సరుకు స్వాధీనం

హైదరాబాద్‌, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి) : చైనా నుంచి అక్రమంగా ప్లాస్టిక్‌ క్లిప్‌లు, హెయిర్‌ బ్యాండ్లు, స్టోరేజ్‌ వార్డ్‌రోబ్‌లు, షూ ర్యాక్‌ల ముసుగులో భారత్‌కు బాణసంచాను దిగుమతి చేస్తున్న ముఠా కార్యకలాపాలను డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌(డీఆర్‌ఐ) అధికారులు గుర్తించారు. చెన్నై పోర్టులో భారీ మొత్తంలో వీటిని స్వాధీనం చేసుకున్నారు.


వీటి విలువ సుమారు రూ.12 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. హైదరాబాద్‌ జోనల్‌ యూనిట్‌కు అందిన సమాచారంతో డీఆర్‌ఐ అధికారులు చెన్నై పోర్టులో అనుమానాస్పద కంటైనర్లలో తనిఖీలు నిర్వహించారు. కార్టన్లలో దాచి ఉంచిన చైనాకు చెందిన పైరోటెక్నిక్‌ బాణసంచా బయటపడినట్లు హైదరాబాద్‌ యూనిట్‌ అధికారులు తెలిపారు.


ఇవి కూడా చదవండి...
ప్రజలపై విద్యుత్‌ చార్జీల భారం మోపడం తగదు!

కేటీఆర్‌ మంత్రిగా ఉన్నప్పుడే సెస్‌లో రూ.32 కోట్ల అవినీతి
పోలీస్‌స్టేషన్‌ ఆవరణలో ఆత్మహత్యాయత్నం చేసిన టీస్టాల్‌ నిర్వాహకుడు సుధాకర్‌ మృతి
Read Latest AP News And Telugu News

Updated Date - Oct 07 , 2026 | 06:33 AM