ఏప్రిల్ 1 నుంచి చికెన్ షాపులు బంద్
ABN , Publish Date - Mar 25 , 2026 | 04:44 PM
తెలంగాణలో చికెన్ వ్యాపారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. పౌల్ట్రీ కంపెనీల విధానాలకు వ్యతిరేకంగా ఏప్రిల్ 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా చికెన్ షాపులను బంద్ చేస్తున్నట్లు చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ ప్రకటించింది.
హైదరాబాద్: పౌల్ట్రీ కంపెనీల విధానాలకు వ్యతిరేకంగా తెలంగాణలో చికెన్ వ్యాపారులు ఆందోళనకు దిగుతున్నారు. తక్కువ మార్జిన్ కారణంగా నష్టాలు ఎదుర్కొంటున్నామని పేర్కొంటూ, ఏప్రిల్ 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా చికెన్ షాపులను బంద్ చేయాలని నిర్ణయించారు. పౌల్ట్రీ కంపెనీలు ఇచ్చే మార్జిన్ సరిపోవడం లేదని వ్యాపారులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో వ్యాపారం నష్టాల్లోకి వెళ్లే పరిస్థితి ఏర్పడిందని చెబుతున్నారు.
చికెన్ ధరలు పెరిగినా, మధ్యవర్తుల విధానాల వల్ల తాము లాభపడడం లేదని వ్యాపారులు అంటున్నారు. తమ సమస్యలను పౌల్ట్రీ కంపెనీలకు పలుమార్లు తెలియజేసినా, సరైన స్పందన రాలేదని ఆరోపించారు. ఈ నేపథ్యంలో తమ డిమాండ్లు పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్తంగా నిరవధికంగా చికెన్ షాపులను మూసివేస్తామని హెచ్చరించారు.
ఏప్రిల్ 1 నుంచి బంద్ ప్రారంభమవుతుందని ప్రకటించారు. చికెన్ షాపుల బంద్ వల్ల వినియోగదారులపై కూడా ప్రభావం పడే అవకాశం ఉందని భావిస్తున్నారు. ప్రభుత్వం మధ్యవర్తిత్వం వహించి సమస్యను పరిష్కరించాలని వ్యాపారులు కోరుతున్నారు.
Also Read:
ఆ ఇళ్లను కొత్త వారికి ఇస్తాం: మంత్రి పొంగులేటి
తెలంగాణ అసెంబ్లీలో డబుల్ బెడ్ రూం ఇళ్లపై చర్చ.. ఎవరేమన్నారంటే..
For More Latest News