Share News

బొల్లారం ఆయుధాల చోరీ కేసు.. వెలుగులోకి సంచలన విషయాలు

ABN , Publish Date - Sep 22 , 2026 | 04:38 PM

బొల్లారంలోని మద్రాస్ రెజిమెంట్‌లో ఆయుధాల చోరీ కేసులో నిందితుడు మల్లేష్‌ను విచారించిన పోలీసులు.. అతడి నుంచి పలు సంచలన విషయాలు రాబట్టారు.

బొల్లారం ఆయుధాల చోరీ కేసు.. వెలుగులోకి సంచలన విషయాలు
Madras regiment arms theft case In Bollaram

హైదరాబాద్, సెప్టెంబర్ 22: బొల్లారంలోని మద్రాస్ రెజిమెంట్‌లో ఆయుధాల చోరీ కేసులో నిందితుడు మల్లేష్‌ను విచారించిన పోలీసులు.. అతడి నుంచి పలు సంచలన విషయాలు రాబట్టారు. నాలుగు నెలల ముందే అతడు ఈ ఆయుధాల చోరీకి పథక రచన చేసినట్లు బొల్లారం పోలీసులు గుర్తించారు.

ఆదివారం.. సెలవు దినం కాబట్టి ఆ రోజే ఆయుధాలను చోరీ చేయాలని అతడు ముందుగా ప్లాన్ వేశాడని తెలిపారు. ఈ క్రమంలో ఆదివారం రోజు గార్డ్‌ ఇన్‌చార్జ్‌లు, ఆర్మీ అధికారుల కదలికలు తక్కువగా ఉంటాయని అతడు గుర్తించి.. ఈ నిర్ణయం తీసుకున్నాడని వివరించారు. దీంతో ఆ రోజే ఆయుధాల చోరీకి అతడు స్కెచ్ వేశాడని చెప్పారు.


అలాగే చోరీ చేసిన ఆయుధాలను సంఘ విద్రోహశక్తులకు విక్రయించాలని మల్లేష్ భావించాడని పోలీసులు పేర్కొన్నారు. అందుకోసం ఆయుధాలు కొనుగోలు చేసే వ్యక్తుల కోసం సోషల్ మీడియాలో అతడు తీవ్రంగా వెతికినట్లు గుర్తించామని పోలీసులు తెలిపారు. తద్వారా వచ్చిన నగదుతో తన ఆర్థిక నష్టాలను పూడ్చుకోవాలని మల్లేష్ నిర్ణయించాడని అన్నారు. మూడేళ్ల పాటు సర్వీస్‌ ఉన్నప్పటికీ.. విధుల నుంచి తొలగించడంతో ఆర్మీ అధికారులపై మల్లేష్ కక్ష పెంచుకున్నాడని తెలిపారు.


దీంతో మద్రాస్ బెటాలియన్ నుంచి ఆయుధాలు చోరీ చేయడం ద్వారా ఆ అధికారుల ప్రతిష్ఠ దెబ్బతీయాలని మల్లేష్ ఈ పథకం వేశాడని వివరించారు. దాదాపు 16 ఏళ్ల పాటు మద్రాస్‌ రెజిమెంట్‌లో మల్లేష్ విధులు నిర్వహించాడని పోలీసులు చెప్పారు. ఆ అనుభవంతోనే ఆయుధాలు చోరీ చేసినట్లు తమ దర్యాప్తులో గుర్తించామని పేర్కొన్నారు.


ఇక ఆర్మీలో తన స్నేహితులు ఇన్‌‌చార్జ్ నాయక్‌ వినోద్‌, మ్యాగజైన్‌ ఇన్‌చార్జ్‌ బల్లి మధు, గార్డ్‌ ఇన్‌చార్జ్‌ హవాల్దార్‌ కేవీ రమణతోపాటు క్వార్టర్‌ గార్డ్‌ ఇన్‌చార్జ్‌ నిరేష్‌తో మల్లేష్ తరచూ ఫోన్ కాల్స్ మాట్లాడినట్లు గుర్తించామని పోలీసులు వివరించారు. ఆర్మీ స్నేహితులతో మాట్లాడి మద్రాస్ రెజిమెంట్‌లో సీసీటీవీ కెమెరాలు.. ఎప్పుడు ఆఫ్‌ చేస్తున్నారంటూ వారిని మల్లేష్ ఆరా తీసిన వారు వెల్లడించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

యూపీఐ పేమెంట్స్‌పై కేంద్రం క్లారిటీ

తిరువూరులో రూ.14 కోట్ల అభివృద్ధి పనులకు సీఎం చంద్రబాబు శ్రీకారం

For More TG News And Telugu News

Updated Date - Sep 22 , 2026 | 05:39 PM