Share News

భారత పైలట్‌ సాహసంపై రాహుల్‌ మౌనమేంటి?

ABN , Publish Date - Oct 02 , 2026 | 06:13 AM

ధైర్య సాహసాలతో అంతర్జాతీయంగా దేశ ప్రతిష్ఠను నిలబెట్టిన భారత పైలట్‌ కెప్టెన్‌ స్మిత్‌ మచ్చర్‌ విషయంలో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ఎందుకు మౌనం వహించారో సమాధానం చెప్పాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రాంచందర్‌రావు డిమాండ్‌ చేశారు.

భారత పైలట్‌ సాహసంపై రాహుల్‌ మౌనమేంటి?
Ramchander Rao

  • బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు

హైదరాబాద్‌, అక్టోబరు 1(ఆంధ్రజ్యోతి): ధైర్య సాహసాలతో అంతర్జాతీయంగా దేశ ప్రతిష్ఠను నిలబెట్టిన భారత పైలట్‌ కెప్టెన్‌ స్మిత్‌ మచ్చర్‌ విషయంలో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ఎందుకు మౌనం వహించారో సమాధానం చెప్పాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రాంచందర్‌రావు డిమాండ్‌ చేశారు. 174 మంది ప్రయాణికుల ప్రాణాలను కాపాడిన కెప్టెన్‌ స్మిత్‌ మచ్చర్‌ ధైర్యసాహసాలపై దేశవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతుంటే... రాహుల్‌ గాంధీ కనీసం స్పందించకపోవడాన్ని ఆయన ‘ఎక్స్‌’ వేదికగా తప్పుపట్టారు.


జాతీయ సమగ్రత, పౌరుల ప్రాణాలను కాపాడిన వీరత్వాన్ని కూడా కాంగ్రెస్‌ పార్టీ తన ‘కపట లౌకికవాద’ కోణంలోనే చూస్తోందన్నారు. భారత కెప్టెన్‌ ప్రదర్శించిన సాహసాన్ని గుర్తించి, కనీసం ఒక్క మాట కూడా అభినందించలేని వ్యక్తి ప్రతిపక్ష నేతగా ఉండటం సిగ్గుచేటని విమర్శించారు.


ఇవి కూడా చదవండి...
ఎన్నికల కమిషన్‌, హైదరాబాద్‌ తగలబడిపోతయ్‌

నల్లమలలో జంగల్‌ సఫారీ పునఃప్రారంభం

Read Latest Telangana News And Telugu News

Updated Date - Oct 02 , 2026 | 06:13 AM