Share News

బిగ్ బాస్ ఫేమ్ డీమాన్ పవన్ ఇంట తీవ్ర విషాదం

ABN , Publish Date - Mar 10 , 2026 | 04:49 PM

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 కంటెస్టెంట్, ప్రముఖ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ డీమాన్ పవన్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. వివరాల్లోకి వెళితే..

బిగ్ బాస్ ఫేమ్ డీమాన్ పవన్ ఇంట తీవ్ర విషాదం
Demon Pavan News

హైదరాబాద్, మార్చి10: బిగ్ బాస్(Bigg Boss) తెలుగు సీజన్ 9 కంటెస్టెంట్, ప్రముఖ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ డీమాన్ పవన్ (Demon Pavan) ఇంట్లో తీవ్ర విషాదం(tragedy) నెలకొంది. గత కొంత కాలంగా క్యాన్సర్‌తో పోరాడుతున్న ఆయన తండ్రి ఈరోజు(మంగళవారం) కన్నుమూశారు. ఈ వార్త విన్న అభిమానులు, బిగ్ బాస్ సహచర కంటెస్టెంట్లు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.


సామాన్యుల కోటాలో బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టిన డిమాన్ పవన్, తన ఆటతీరుతో అనతికాలంలో లక్షల మంది హృదయాలను గెలుచుకున్నాడు. షోలో ఉన్న సమయంలో తన తండ్రి ఆరోగ్య పరిస్థితి గురించి పవన్ పలుమార్లు ఎమోషనల్ అయ్యారు. బిగ్ బాస్ షోకి పవన్ తండ్రి కూడా వచ్చాడు. ఒకానోక దశలో తన తండ్రి కోలుకుంటున్నారని, క్యాన్సర్‌ను జయించారని అంతా భావించిన తరుణంలో ఈ విషాదం చోటు చేసుకోవడం అందరినీ కలచివేస్తోంది. తన తండ్రి మరణవార్తను పవన్ స్వయంగా తన సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ ‘నాన్న.. మీ ఆశీస్సులు ఎప్పుడూ నాతో ఉంటాయి’ అని ఎమోషనల్ పోస్ట్ చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

సీఎం చంద్రబాబు అధ్యక్షతన 59వ సీఆర్డీఏ అథారిటీ సమావేశం

రైతులపై కేసులు నమోదు చేస్తే తీవ్ర పరిణామాలు.. బండి సంజయ్ హెచ్చరిక

For More AP News And Telugu News

Updated Date - Mar 10 , 2026 | 05:41 PM