Share News

ఓట్‌ చోరీపై ప్రత్యేక ప్రదర్శన

ABN , Publish Date - Nov 14 , 2026 | 06:54 AM

సర్‌ ప్రక్రియపై భారత్‌ సమ్మిట్‌లో ప్రత్యేక ప్రదర్శన నిర్వహించారు. సమ్మిట్‌లో భాగంగా శుక్రవారం ప్రారంభించిన ఎక్స్‌పోలో వైకుంఠపాళి తరహా చార్ట్‌ను ఏర్పాటుచేశారు.

ఓట్‌ చోరీపై ప్రత్యేక ప్రదర్శన
Vote Chori Exhibition

హైదరాబాద్‌, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి): సర్‌ ప్రక్రియపై భారత్‌ సమ్మిట్‌లో ప్రత్యేక ప్రదర్శన నిర్వహించారు. సమ్మిట్‌లో భాగంగా శుక్రవారం ప్రారంభించిన ఎక్స్‌పోలో వైకుంఠపాళి తరహా చార్ట్‌ను ఏర్పాటుచేశారు. అందులో ఓటు నమోదు ఎలా చేస్తారు, దానిని ఎలా తిరస్కరిస్తారు, దశల వారీగా వివరాలు ఉంచారు. దాంతో ఎక్స్‌పోకు వచ్చిన వారు ఆ వైకుంఠపాళి గురించి తెలుసుకోవడంతో పాటు కొంతమంది ఆట ఆడారు.


మరోవైపు మిమిక్రీ ఆర్టిస్ట్‌ చిన్న బొమ్మతో మాట్లాడిస్తూ ఇండియాలో సర్‌ పేరుతో ఓట్‌ చోరీ జరుగుతోందంటూ వివరించడం ఆకర్షించింది. అలాగే భారతదేశానికి, ఇతర దేశాలతో ఉన్న సత్సంబంధాలు, ఆయా దేశాలతో జరిపిన వ్యాపార వ్యవహారాలు సహా పలు అంశాలను ప్రదర్శించారు.


ఇవి కూాడా చదవండి..

విచిత్రం: ఓవర్ స్పీడ్‌కు చలానా.. లొకేషన్ మాత్రం అట్లాంటిక్ మహాసముద్రం!

అస్సాంలో ఘోర ప్రమాదం.. మినీబస్సు, కంటైనర్ ట్రక్కు ఢీకొని పలువురి మృతి

Updated Date - Nov 14 , 2026 | 06:59 AM