బేగంపేట్‌లో నకిలీ ఎయిర్‌ఫోర్స్ అధికారి.. యువతులకు వల వేస్తూ బుక్కయ్యాడు..!
ABN , Publish Date - Oct 08 , 2026 | 04:34 PM
బేగంపేట్‌లో నకిలీ ఎయిర్‌ఫోర్స్ అధికారి కలకలం సృష్టించాడు. ఫ్లయింగ్ ఆఫీసర్ డ్రెస్‌లో బేగంపేట్ పరేడ్ గ్రౌండ్‌లోకి ప్రవేశించిన నిందితుడు.. అక్కడ ఫొటోలు దిగుతూ సంచరించాడు. అనుమానాస్పదంగా వ్యవహరించడంతో మిలిటరీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
హైదరాబాద్: బేగంపేట్‌లో నకిలీ ఎయిర్‌ఫోర్స్ అధికారి కలకలం సృష్టించాడు. ఫ్లయింగ్ ఆఫీసర్ డ్రెస్‌లో బేగంపేట్ పరేడ్ గ్రౌండ్‌లోకి ప్రవేశించిన నిందితుడు.. అక్కడ ఫొటోలు దిగుతూ సంచరించాడు. అనుమానాస్పదంగా వ్యవహరించడంతో మిలిటరీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. తనిఖీల అనంతరం అతడిని నకిలీ ఎయిర్‌ఫోర్స్ అధికారిగా తేల్చారు. నిందితుడిని బిహార్‌కు చెందిన నితీశ్ కుమార్ పాల్‌గా గుర్తించారు. అతను ప్రస్తుతం నేరెడ్‌మెట్‌లో నివాసం ఉంటున్నట్లు తెలిపారు.
అయితే, తాను ఎయిర్‌ఫోర్స్ అధికారినంటూ నితీశ్ కుమార్ యువతులకు వల వేస్తున్నట్లు విచారణలో అధికారులు గుర్తించారు. నిందితుడి ఫోన్‌ను తీసుకుని పరిశీలించగా.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఎయిర్‌ఫోర్స్ అధికారి పేరుతో యువతులకు పరిచయం అవుతున్నట్లు నిర్ధారించారు. వారిని వలలో వేసుకునేందుకే తాజాగా ఫొటోలు దిగేందుకు పరేడ్ గ్రౌండ్‌కు వచ్చినట్లు అనుమానిస్తున్నారు. విచారణ అనంతరం నిందితుడిని మిలిటరీ అధికారులు బేగంపేట్ పోలీసులకు అప్పగించారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అతడు ఎప్పటి నుంచి నకిలీ అధికారి అవతారంలో కొనసాగుతున్నాడు? ఎవరెవరిని మోసం చేశాడు? అనే కోణాల్లో విచారణ జరుపుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
రైతులపై కేసులు నమోదు.. అత్యంత హేయమైన చర్య: ఎమ్మెల్యే హరీశ్ రావు
వికారాబాద్‌లో నకిలీ బంగారం కలకలం